బోగస్ విరాళాలు పొందిన రాజకీయ పార్టీలపై ఐటీ అధికారులు బుధవారం నాడు దేశ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: బోగస్ విరాళాలు, పన్ను మోసాలపై వేశ వ్యాప్తంగా పలు రాష్టాల్లో రిజిస్టరై గుర్తింపు పొందని రాజకీయ పార్టీలపై ఐటీ అధికారులు బుధవారం నాడు సోదాలు చేస్తున్నారు. దాదాపుగా 12 రాష్ట్రాలల్లోని పలు నగరాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాజకీయ పార్టీలు చట్టబబద్దమైన నిబంధనలు పాటించకుండా విరాళాలు స్వీకరించడం ద్వారా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాయని సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా విరాళాలు స్వీకరించిన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఈసీఐ రాజీవ్ కుమార్ రెవిన్యూ శాఖకు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా 199 రాజకీయ పార్టీలు రిజిస్టేషన్ చేసుకున్నప్పటికీ గుర్తింపు పొందలేదు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు 2018-19లో రూ. 445 కోట్లు పన్ను మినహాయింపును పొందాయి. 2019-20 లో రూ. 608 కోట్లు పన్ను మినహయింపు పొందాయని ఈసీ తెలిపింది. 2019-20 లో 219 రాజకీయ పార్టీలు పన్ను మినహాయింపును పొందాయి. ఇందులో 66 రాజకీయ పార్టీలు రూ.385 కోట్ల పన్ను మినహాయింపును పొందడం గమనార్హం.,
ఈసీఐ నిబంధనల మేరకు సెక్షన్ 29 సీ కింద తప్పనిసరి చేసిన 24 ఏ కంట్రిబ్యూషన్ రిపోర్టులను కొన్ని రాజకీయ పార్టీలు సమర్పించలేదు. అయితే ఒక్కో పార్టీ రూ. 100 నుండి రూ. 150 కోట్ల పన్ను మినహాయింపు పొందాయి. అయితే ఈ విషయమై నిబంధనలు పాటించలేదని ఈసీ గుర్తించి రెవిన్యూ శాఖకు లేఖ రాసింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి నల్లధనాన్ని ఉపయోగించకుండా ఉండేందుకు గాను నిబంధనలు పాటించని పార్టీలపై చర్యలకు ఈసీ చర్యలకు ఉపక్రమించింది.
చట్టబద్దమైన నిబంధనలను పాటించకుండా ఐటీ మినహయింపును క్లెయిమ్ చేసిన పార్టీలపై ఈసీ చర్య తీసుకొంది. బోగస్ విరాళాలు పొందిన 87 రాజకీయ పార్టీలను తన జాబితా నుండి ఈసీ తొలగించింది. 1951 లోని సెక్షన్ 29 సీ ప్రకారంగా చట్టబద్దంగా విరాళాలు స్వీకరించని పార్టీలకు సంబంధించిన వివరాలను రెవిన్యూ శాఖకు పంపింది ఈసీ, రిజిస్ట్రేషన్ చేసుకొని గుర్తింపు పొందని పార్టీలు చేసిన తప్పులకు సంబంధించిన నివేదికను ఈసీ పంపింది. బోగస్ విరాళాలు, రసీదులు, వంటి వాటికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీలపై ఈసీ చర్యలకు ఉప క్రమించింది.
