అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా కాలంలో ప్రభుత్వం మాస్కులు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్ కు చెందిన అనితా టెక్స్ కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ పై ఐటీ దాడులు చేయడంతో అవినీతి విషయం బట్టబయలైంది. 

అలాగే ఈ సంస్థలో రూ. 11 కోట్ల లెక్కల్లో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ. 80 కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది.