తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్, నిర్మాత జీఎన్ అన్బు చెజియన్ నివాసంలో ఐటీ అధికారులు సోదారులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్, నిర్మాత జీఎన్ అన్బు చెజియన్ నివాసంలో ఐటీ అధికారులు సోదారులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, మధురైలలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 40 లోకేషనల్లో ఐటీ అధికారులు సోదాలు జరపడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. అన్బు ఇళ్లు, కార్యాలయాలతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలస్తోంది. 

మధురైలో దాదాపు 30 చోట్ల సోదాలు జరుగుతుండగా, చెన్నై, ఇతర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నట్టుగా ఐటీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే మరికొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా ఐటీ స్కానర్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. దీంతో పలవురు ఆందోళన చెందుతున్నారు. 

ఇక, అన్బు పలు తమిళ చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఆయన Gopuram Films bannerపై పలు చిత్రాలను కూడా నిర్మించడంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడు. అన్బు‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం ఇది మూడోసారి. అంతకుముందు 2020 ఫిబ్రవరిలో.. విజయ్ నటించిన బిగిల్ చిత్రం విడుదలైన తర్వాత అన్బు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. అక్కడి నుంచి రూ. 65 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపిన అధికారులు.. ఆయనను ప్రశ్నించారు.