Asianet News TeluguAsianet News Telugu

15 ఏళ్లుగా బీజేపీ ఏం చేసిందో చూపించడం సిగ్గుచేటుగా ఉంది.. : ఘాజీపూర్ చెత్తకుప్పను సందర్శించిన కేజ్రీవాల్

Ghazipur: బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ నిరసనల మధ్య ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు అర‌వింద్ కేజ్రీవాల్ ఘాజీపూర్ చెత్తకుప్పను సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 15 ఏళ్లుగా బీజేపీ ఏం చేసిందో చూపించడం సిగ్గుచేటుగా ఉంద‌న్నారు.

It is shameful to show what BJP has done for 15 years..: Kejriwal visits Ghazipur garbage dump
Author
First Published Oct 27, 2022, 1:56 PM IST

Delhi Chief Minister Arvind Kejriwal: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు చెత్త పర్వతాలను నిర్మించి దేశ రాజధానిని వ్యర్థాలతో నింపిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నాయ‌కుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయ‌న గురువారం బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ నిరసనల మధ్య ఘాజీపూర్ చెత్తకుప్ప ల్యాండ్‌ఫిల్ సైట్‌ను సందర్శించారు. ల్యాండ్‌ఫిల్ సైట్ సంద‌ర్శించిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 15 ఏళ్లుగా బీజేపీ ఏం చేసిందో చూపించడం సిగ్గుచేటుగా ఉంద‌న్నారు. "మన వెనుక చెత్త పర్వతం కనిపిస్తుంది.. గత 15 సంవత్సరాలుగా బీజేపీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను పాలిస్తోంది. ఈ కాలంలో వారు ఢిల్లీకి అలాంటి మూడు పర్వతాల చెత్తను అందించారు. వారు ఢిల్లీ మొత్తాన్ని చెత్త కుప్పగా మార్చారు. ఢిల్లీ ప్రజలు వారికి నగరాన్ని శుభ్రం చేసే ఒక పనిని ఇచ్చారు" అని ఆయన విమ‌ర్శించారు.

'బీజేపీ ఇలాంటి పని చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్లలో మేము పాఠశాలలను మెరుగుపరిచాము. మీరు (బీజేపీ) వచ్చి మా పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు చూడండి.. మేము మిమ్మల్ని అడ్డుకోము, మీరు చేసిన పనిని చూపించడానికి మీరు సిగ్గుపడుతున్నారు. 15 ఏళ్లుగా ఆయన పర్యటనకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ" కేజ్రీవాల్ విమ‌ర్శించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD)లో 15 ఏళ్లలో బీజేపీ తన పని తీరును చూపుతుందని సవాలు చేస్తూ.. “ఈ చెత్త పర్వతం వారి దుర్మార్గాలు.. అవినీతికి పర్వతం, వారు ఢిల్లీ ప్రజలను మోసం చేసిన విధానానికి నిద‌ర్శ‌నం” అంటూ విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు. ఢిల్లీ ప్రభుత్వం ఎంసీడీకి నిధులు కేటాయించలేదన్న ఆరోపణపై సీఎం కేజ్రీవాల్ 15 ఏళ్లలో కార్పొరేషన్ రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఎంసీడీకి కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదని పేర్కొన్న ఆయ‌న‌.. ఈ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

 

It is shameful to show what BJP has done for 15 years..: Kejriwal visits Ghazipur garbage dump

రాబోయే MCD పోల్ ఢిల్లీలోని చెత్తను తొలగించడం, దేశ రాజధాని పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై పోరాడుతుందని నొక్కి చెప్పారు. అంత‌కుముందు రోజు బుధ‌వారం నాడు ఒక ట్వీట్‌లో కేజ్రీవాల్.. "నేను వారి నాయకులలో ఒకరిని అడిగాను.. 15 ఏళ్లలో మీరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏమి పని చేసారు? అతను రెండు విషయాలు చెప్పాడు.. ఒక‌టి మూడు పెద్ద చెత్త పర్వతాలను నిర్మించ‌డం.. ఢిల్లీ మొత్తం చెత్త‌తో నిండిపోడం అంటూ విమ‌ర్శించారు. అలాగే, తాను గురువారం ఉద‌యం  ఘాజీపూర్ చెత్త పర్వతాన్ని చూడటానికి వెళ్తాను.. త‌న‌తో క‌లిసి రావాలంటూ పిలుపునిచ్చారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios