హిందూ వివాహ చట్టం ప్రకారం "అన్ని అర్ధవంతమైన సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం, ఇద్దరి మధ్య ఉన్న చేదు అనుభవాలని" బట్టి వివాహాన్ని పునరుద్దరించడం "క్రూరత్వం"గా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ : నాలుగేళ్లు మాత్రమే కలిసి కాపురం చేసిన ఓ జంట.. గత 25యేళ్లుగా విడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసులో సుప్రీంకోర్టు వీరిద్దరూ విడిపోవడమే న్యాయం అంటూ తీర్పు చెప్పింది. వారిని కలిసి ఉండాలని చెప్పడం క్రూరత్వం కిందికి వస్తుందని తేల్చింది.
25 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న జంటను వివాహితులుగా గుర్తిస్తే క్రూరత్వానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంటూ వారి వివాహాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ జంట నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసి, కాపురం చేశారు. వీరి మధ్య "అన్ని అర్ధవంతమైన సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇద్దరి మధ్య ఉన్న చేదు అనుభవాలే మిగిలాయి" అలాంటి వివాహాన్ని పునరుద్ధరించి, కలిసి ఉండాలని తీర్పునిస్తే.. హిందూ వివాహ చట్టం ప్రకారం "క్రూరత్వం"గా ఉంటుందని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
"మా ముందు నిలుచున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నారు. ఈ జంట గత 25 సంవత్సరాలుగా విడిగా జీవిస్తున్నారు. వారికి పిల్లలు లేరు. వారి వైవాహిక బంధం పూర్తిగా విచ్ఛిన్నమైంది, దానికి ఇక ఏమాత్రం పునరుద్ధరించలేం" అని సుప్రీం పేర్కొంది.
రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపులు చేసిన 60 ఏళ్ల నిందితుడు అరెస్టు
"ఈ సంబంధం ముగిసిపోవాలనడంలో సందేహం లేదు, ఎందుకంటే దానిని కొనసాగించడం అంటే క్రూరత్వానికి అనుమతి ఇవ్వడమే. దీర్ఘకాలం విడిగా ఉండడం, సహజీవనం లేకపోవడం, అన్ని అర్ధవంతమైన బంధాలను పూర్తిగా తెంచుకోవడం, ఇద్దరి మధ్య ఉన్న చేదుఅనుభవాలను హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వంగా చూడాలి" అని సుప్రీంకోర్టు చెప్పింది.
వారికి పిల్లలు లేనందున వారి విడాకులు.. వారిపై మాత్రమే ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ కేసులో భర్త సంపాదన నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ. కాబట్టి అతను నాలుగు వారాల్లోగా మహిళకు రూ. 30 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ జంట 1994లో ఢిల్లీలో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది తనకు చెప్పకుండా భార్య అబార్షన్ చేయించుకుందని భర్త ఆరోపించాడు. తమ ఇల్లు చిన్నగా ఉండడం ఆమెకు ఇష్టం లేదని ఆరోపించారు.
పెళ్లయిన నాలుగేళ్లకే ఆ మహిళ అతడిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ వ్యక్తిని, అతని సోదరుడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. క్రూరత్వం, సుదీర్ఘ కాలం విడిగా ఉండడం వంటి కారణాలతో ట్రయల్ కోర్టు విడాకుల పిటిషన్‌ను అనుమతించింది. కానీ ఢిల్లీ హైకోర్టు విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది, ఆ తర్వాత వ్యక్తి హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాడ
