Asianet News TeluguAsianet News Telugu

ఇస్రో మరో విజయం: విజయవంతంగా నింగిలోకి జీశాట్-11

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పది రోజుల వ్యవధిలో మరో విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.  

isro successfully lifts gsat 11
Author
Delhi, First Published Dec 5, 2018, 8:26 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పది రోజుల వ్యవధిలో మరో విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు కొత్తతరం అప్లికేషన్ల రూపకల్పనకు ఇది వేదికగా నిలుస్తుంది. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సెకనుకు 100 జీబీ డేటా అందించడం ఈ ప్రయోగం ముఖ్యోద్దేశం.

5,854 కిలోల పరిమాణంలో ఉన్న జీశాట్-11 ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటికంటే బరువైనది. ‘‘బిగ్‌బర్డ్’’గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లు ఇస్రో వెచ్చించింది. జీశాట్-11 ప్రయోగ విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios