Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-2: భూమి ఫోటోల విడుదల


చంద్రయాన్-2 తీసిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు విడుదల చేసింది.  చంద్రయాన్ -2 విక్రమ్ లాండర్ తన కెమెరాలో బంధించిన ఫోటోలను ఇస్రో ట్వీట్ చేసింది.
 

ISRO releases first set of Earth pictures captured by Chandrayaan-2
Author
New Delhi, First Published Aug 4, 2019, 1:16 PM IST

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 విక్రమ్ లాండర్  తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.

 

 

చంద్రయాన్-2 లోని అన్ని విభాగాలు విజయవంతంగా సాగుతున్నాయని ఇస్రో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగష్టు 6 వతేదీన ఆర్బిట్ కక్ష్య పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.

ఒకటి, రెండు, మూడు ఆర్బిట్ల కక్ష్య పెంపులు విజయవంతమయ్యాయి.  చంద్రయాన్-2  ఈ నెల 20వ తేదిన చంద్రుడిపై చేరుకోనుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొనేలా ఇస్రో ప్లాన్ చేసింది.చంద్రయాన్-2ను ఈ ఏడాది జూలై 22వ తేదిన ప్రయోగించారు. ఈ ప్రయోగంలోని నాలుగు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios