Asianet News TeluguAsianet News Telugu

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 49

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీఎస్ఎల్‌వీ సీ 49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 

isro launches pslv c 49 carrying eos 01 ksp
Author
Sriharikota, First Published Nov 7, 2020, 3:19 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీఎస్ఎల్‌వీ సీ 49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ను ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా కౌంట్‌డౌన్‌ను 10 నిమిషాలు పొడిగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపనున్నారు. ఈఓఎస్‌-01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది.

పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం. రిశాట్-2 బీఆర్2 శాటిలైట్‌ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది.

సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్‌) ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్‌ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios