Asianet News TeluguAsianet News Telugu

EXCLUSIVE: మరికొన్నేళ్లలో భారతీయుడు చంద్రుడిపై అడుగుపెడతాడు: ఇస్రో చైర్మన్‌

EXCLUSIVE: చంద్రయాన్-3 విజయవంతమవడంతో భారత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఇస్రో మరెన్నో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తోంది. ఈ విషయాలపై ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఇస్రో చైర్మన్‌తో ప్రత్యేకంగా సంభాషించింది. ఇస్రో తదుపరి కార్యచరణపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌తో ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా .. ప్రత్యేక ఇంటర్య్వూ తీసుకున్నారు. ఈ సమయంలో ఇస్రో సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌

ISRO Chairman says an Indian will land on Moon in a few years KRJ
Author
First Published Sep 22, 2023, 12:12 AM IST

EXCLUSIVE: ఇస్రో తన సామార్థ్యాలను రోజురోజుకు మెరుగుపరుచుకుంటుందనీ, రాబోయే రోజుల్లో భారతీయ అంతరిక్ష సంస్థ తన అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి పంపాలని భావిస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేష్ కల్రాకు ఇచ్చిన ప్రత్యేక సంభాషణలో తెలిపారు. ఈ తరుణంలో ఇస్రో తనకు తానుగా నిర్దేశించుకుంటున్న ఉన్నత లక్ష్యాలను అంతరిక్ష సంస్థ ఛైర్మన్ వివరించారు.  

ఇస్రో కార్యకలాపాలను పరిశీలిస్తే.. తాము కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించడం వంటి కార్యాచరణ వ్యవస్థలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. జాతీయ డిమాండ్‌లు, కొన్ని సైన్స్ మిషన్‌లను తీర్చడానికి తాము రెండు మూడు సంవత్సరాలలో ఒక మిషన్‌ను మాత్రమే ప్రయోగించేవారమనీ, కానీ ఇది చంద్రయాన్-3 విజయం తమలో అంతులేని విశ్వాసాన్ని ఇచ్చిందని అన్నారు. 

ఈ చంద్రయాన్ విజయంలో ఇస్రో బాధ్యత చాలా పెరిగిందని, అన్వేషణలు,శాస్త్రీయ కార్యకలాపాలను చాలా తరచుగా కొనసాగించాలని,  చంద్రునిపై దిగడానికి మాత్రమే పరిమితం కాకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు.  ఇస్రో.. చంద్రయాన్ ట్రాక్ ను (చంద్రయాన్-1, చంద్రయాన్-2,  చంద్రయాన్-3) పరిశీలిస్తే అర్థమవుతుందని అన్నారు. తదుపరి మంగళయాన్ ప్రాజెక్ట్ నిర్వహించనున్నామనీ, ఆ తరువాత  ఆస్ట్రోశాట్, ఎక్స్‌పోసాట్ వంటి ప్రయోగాలను చేయబోతున్నామని అన్నారు. అలాగే.. భారత వోమగాములను అంతరిక్షంలోకి పంపబోతుమని తెలిపారు.  

"మన అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలో ఎలా ప్రవేశపెట్టాలి? మనం అంతరిక్షంలో ఎందుకు ప్లాట్‌ఫారమ్ ( ల్యాబ్) ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? ఇంకా ఆ విధంగా ఆలోచిస్తాలేరా ? అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. నేడు మనకున్న సామర్థ్యం, అలాగే.. రాబోయే కొద్ది సంవత్సరాలలో మనం అభివృద్ధి చెందగల సామర్థ్యంతో మనం ఓ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యకు పంపగలమని మేము భావిస్తున్నాం. వాటిని అనుకూలంగా ప్రయోగాలను నిర్వహించబోతున్నాం." అని తెలిపారు. 

గగన్‌యాన్‌ ఖచ్చితంగా జరుతుంది. అయితే అంతకు మించి ఏముంది? ఇది నిరంతర ప్రకియనా?  మానవ అంతరిక్షయాన కార్యక్రమంగా కొనసాగుతుందా? ప్రశ్నించగా..  ఇస్రో చీఫ్ సమాధానమిస్తూ..  చంద్రయాన్ కార్యక్రమం అనంతరం గగన్‌యాన్.. ఆ తరువాత చంద్రునిపై మానవ సహిత అంతరిక్ష యాత్రగా చేపట్టబోతున్నామని అన్నారు.  

బహుశా అమృత్ కాల్ 2047లో ఆ పరిణామం జరగవచ్చు. కానీ, చంద్రునిపై నిరంతర అన్వేషణ అవసరం. చంద్రునిపైకి వెళ్ళడానికి మరింత స్వదేశీ సామర్థ్యాన్ని అవసరం.  అయితే.. మేము దీన్ని చాలా తక్కువ సమయంలో ఎలా చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాము. త్వరలో చంద్రునిపైకి రోబోట్‌ను సామర్థవంతంగా పంపగలిగితే.. మరికొన్ని సంవత్సరాల్లో ఓ  భారతీయుడు ఖచ్చితంగా చంద్రునిపై అడుగుపెడతాడని సోమనాథ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios