ISRO 100th mission సక్సెస్ : వందలో ఎన్ని సక్సెస్ ఎన్ని? విఫలం ఎన్ని? సెంచరీ శాటిలైట్ స్పెషాలిటీ ఏమిటి?
ISRO100వ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. GSLV-F15 రాకెట్ ద్వారా నా విక్ సిస్టమ్‌కు సంబంధించిన SVN 02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 1979 నుంచి ఇప్పటివరకు 99 ప్రయోగాలు చేసిన ఇస్రో తాజా లాంచ్ తో 100 ప్రయోగాలు పూర్తి చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఇస్రో ప్రత్యేకత.

ఇస్రో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) నుండి వంద ప్రయోగాలు పూర్తి చేసింది. 2024 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించి, 2025 ప్రారంభంలో సెంచరీ రికార్డును నమోదు చేసింది. ఈ రోజు 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు GSLV-F15 రాకెట్ ప్రయోగం.. అది విజయవంతం కావడం మనం ఊహించిందే.
ఇస్రో ఫ్రయోగాల్లో ఎన్ని సక్సెస్ అయ్యాయంటే
మొత్తం 100 ప్రయోగాలలో 9 విఫలమయ్యాయి. మిగతా 91 ప్రయోగాలు విజయవంతం అయ్యాయయి. అందులో 129 స్వదేశీ ఉపగ్రహాలు, 433 విదేశీ శాటిలైట్లు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. గడిచిన నాళ్లలో రష్యాపై ఆధారపడిన భారతదేశం, ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలు, రాకెట్లు తయారుచేస్తోంది.
isro 100th mission స్పెషాలిటీ ఏమిటి
100వ ప్రయోగంలో, దేశీయ నావిగేషన్ సిస్టమ్ నావిక్‌కు సంబంధించిన SVN 02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిని షార్‌లోని రెండో వేదిక నుంచి లాంచ్ చేశారు. ఈ ఉపగ్రహం భారతదేశ విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఈ శాటిలైట్, భారత దేశం, సరిహద్దుల్లో 1500 కిలోమీటర్ల పరిధిలో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందించే విధంగా డిజైన్ చేయబడింది.
1979లో మొదలైన ప్రయోగాల నుంచి ఇస్రో ఇప్పటికే చాలా పెద్ద విజయాలను సాధించింది. తాజాగా, నావిక్ టెక్నాలజీ ఆధారిత చిన్న పరికరాల ద్వారా అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతోంది.
NavIC ఎలా పని చేస్తుంది?
NavIC (నావిక్) అనేది ప్రత్యేకమైన ఒక సాంకేతికత, ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన అటామిక్ క్లాక్ ద్వారా పనిచేస్తుంది. తాజాగా ప్రయోగించిన వ్యవస్థ ఇదే. దీని ద్వారా భారతదేశ విమానయాన, నౌకాయాన మార్గాలు, అలాగే సైనిక అవసరాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు.
గతంలో ఈ టెక్నాలజీ కోసం భారత్ రష్యా మీద ఆధారపడి ఉండగా, ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఈ రకమైన టెక్నాలజీకి భారత్ స్వంతంగా ఆధారపడుతుంది.
ఇస్రో సాంకేతిక పురోగతితో ప్రపంచంలో గణనీయమైన మార్పు సాధించింది. ఇప్పటి వరకు నావిక్ సిగ్నల్స్ సుమారు పెద్ద పరిమాణంలోని పరికరాల ద్వారా మాత్రమే రిసీవ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ తాజా ప్రయోగంతో ఈ సిగ్నల్స్ ఇప్పుడు చిన్న చిప్ పరికరాలు కూడా రిసీవ్ చేయగలుగుతాయి, అంటే గ్యాడ్జెట్‌లు, స్మార్ట్ వాచ్‌లలో కూడా ఈ సాంకేతికత ఉపయోగపడగలుగుతుంది.
ఇస్రో భవిష్యత్తులో ఏం చేయబోతోంది
ఇస్రో ప్రస్తుతం అంతరిక్ష రంగంలో అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైన ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఒకప్పుడు రష్యా నుండి ఇంజిన్లు దిగుమతి చేసుకునే ఇస్రో, ఇప్పుడు స్వయంగా తయారుచేసుకుంటోంది. 104 శాటిలైట్లు ఒకేసారి ప్రయోగించడం వంటి సాహసాలు చేస్తోంది. ఇస్రో మరింత ఆధునిక, సమర్థతతో కూడిన శాటిలైట్లు, రాకెట్లు, ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయోగాల అనుభవం ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో, గగనయాన్, భారత అంతరిక్ష కేంద్రం వంటి అత్యంత కీలక ప్రయోగాల కోసం ఈ వందవ ప్రయోగం దారి తీస్తుంది. ఇవి కేవలం ఇస్రో సాధించే విజయాలు కాకుండా, భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ప్రముఖ దేశంగా ఎదిగిందనడానికి సాక్ష్యాలు.