Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం: పాలస్తీనాకు మద్దతుగా కాంగ్రెస్ తీర్మానం

ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో  కాంగ్రెస్ పార్టీ  పాలస్తీనాకు మద్దతుగా తీర్మానం చేసింది.  

Israel-Palestine Conflict: Congress Extends Support for Palestinians, Calls For Ceasefire lns
Author
First Published Oct 9, 2023, 6:46 PM IST | Last Updated Oct 9, 2023, 7:16 PM IST


న్యూఢిల్లీ:  ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో  కాంగ్రెస్ పార్టీ పాలస్తీనాకు  మద్దతును ప్రకటించింది.ఈ మేరకు  ఆ పార్టీ తీర్మానం చేసింది.  ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై  సీడబ్ల్యూసీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. పాలస్తీనా ప్రజల హక్కుల కోసం తమ మద్దతును తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది.హమాస్, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలో శనివారం నాడు 1200 మంది మృతి చెందారు.

 

ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య వివాదం పరిష్కారం కోసం చర్చలు కొనసాగించాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ నొక్కి చెప్పింది.సుదీర్థకాలం పాటు  పోరాటం చేస్తున్న పాలస్తీనా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించింది. ఇరు వర్గాలు తక్షణమే కాల్పుల విరమణకు దిగాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.  సమస్యల పరిష్కారానికి చర్చలు అత్యుత్తమైన మార్గాలని కాంగ్రెస్ కోరింది.ఈ విషయమై బీజేపీ నేత అనిల్ ఆంటోని  స్పందించారు. కాంగ్రెస్ తీర్మానంపై ఆయన మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios