isha maha shivratri 2022: భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈషా ఫౌండేషన్ లో జరిగే శివరాత్రి వేడుకలను ఈ రోజు 12 గంటలకు వీక్షించవచ్చు.
isha maha shivratri 2022: భారతదేశమంతటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘హర హర మహాదేవ శంభోశంకర’ అంటూ శివనామ స్మరణతో శివాలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. శివభక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివయ్యను భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే మహాశివరాత్రి సందర్బంగా.. భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ వాసుదేవ్ గా, సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచమంతటా మార్చి 1, 2022 న మహా శివరాత్రిని జరుపుకుంటున్నారు. కాగా ఈషా ఫౌండేషన్ లో ‘శివుని యొక్క గొప్పరాత్రి’మహా శివరాత్రిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆధ్యాత్మిక సంస్థ అయిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు ఈ ఈషా ఫౌండేషన్ లో ఎన్నో అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
కోవిడ్ నిబంధనలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోటోకాల్ ప్రకారం 2022 మహా శివరాత్రి వేడుకలను ఈ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాపోన్, మాస్టర్ సలీమ్, హన్స్‌రాజ్ రఘువంశీ, మంగ్లీ మరియు సీన్ రోల్డన్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ యొక్క సొంత స్వదేశీ బ్యాండ్ - సౌండ్స్ ఆఫ్ ఇషా ద్వారా సంగీత ప్రదర్శన మరియు ఇషా సంస్కృతి ద్వారా నృత్య ప్రదర్శనలు కూడా ప్రదర్శించబడతాయి.
ఈవెంట్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, కన్నడ, బంగ్లా, తెలుగు, తమిళం, మలయాళం మరియు 6 విదేశీ భాషలు - నేపాలీ, రష్యన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, చైనీస్‌లలో లైవ్ శాటిలైట్ ఫీడ్‌ల ద్వారా ప్రసారం చేయబడుతుంది. గత సంవత్సరం సద్గురు ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ లో ప్రసారమైన శివరాత్రి వేడుకలను సుమారుగా 100 మిలియన్లకు ప్రజలు వీక్షించారు. ఈ ఈవెంట్ ను లాస్ట్ ఇయర్ లైవ్ స్ట్రీమింగ్ ను 20 మిలియన్ల ప్రజలు వీక్షించారు. గతేదాది ఆ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ లో అగ్రగామిగా నిలిచింది.
ఈ ఈవెంట్ కు వెళ్లాలనుకున్న వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఈవెంట్ ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్ చేయడానికి 0422-2515470 / 71కి కాల్ చేయండి లేదా ishastay@ishafoundation.orgలో ఈ మెయిల్ చేయండి. లైవ్ లో చూడాలనుకుంటే.. దాని Official Website అయిన isha.sadhguru.org/mahashivratri/live-webstream/లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
