భారత్‌లో అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్‌తో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట కొత్త కాపురం ఎక్కడి నుంచి మొదలుపెడతారు.

ముంబైలో ఉంటారా లేదా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడిచింది. దీనికి తెర దించుతూ.. ఒక వార్త పారిశ్రామిక వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈషా, ఆనంద్ నివాసముండేందుకు వీలుగా వరుడి తల్లిదండ్రులు ముంబైలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల విలాసవంతమైన భవంతిని కానుకగా ఇచ్చారట.

దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్రానికి చేరువలో సముద్ర వంతెన దిగువన ఈ భవనం నెలకొని ఉంది. ఈ భవనం ముఖేశ్ అంబానీ నివాసం కంటే 8 రెట్లు విశాలమైనది. దీనికి ‘‘గులీటా’’ అనే పేరు పెట్టినట్లు సమాచారం.

రియల్ ఎస్టేట్,  ఫార్మా రంగాల్లో రాణిస్తున్న పిరమల్స్ కుటుంబం 2012లో ఈ భవనాన్ని హిందుస్థాన్ యూనీలీవర్ నుంచి 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీనిని త్రీడీ మోడలింగ్‌తో లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ అద్భుతంగా తీర్చిదిద్దిందట. ఇందులో డైనింగ్ రూమ్‌లతో పాటు అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇక్కడి నుంచే ఆనంద్, ఈషా తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.