Asianet News TeluguAsianet News Telugu

భర్త.. భార్యను కొట్టడం తప్పేం కాదు.. సర్వేలో షాకింగ్ నిజాలు.. తెలుగురాష్ట్రాలే టాప్...

కొన్ని పరిస్థితుల్లో భార్యను చితకగబాదడం తప్పేమీ కాదని దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు.  Andhra Pradesh, Telanganaల్లో నైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84 శాతంగా ఉంది.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( ఎన్ హెచ్ఎఫ్ ఎస్)-5  ఈ మేరకు వివరాలను బయటపెట్టింది.  దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. 

Is husband justified in beating the wife?.. shocking results in NHFS survey
Author
Hyderabad, First Published Nov 29, 2021, 8:17 AM IST

ఢిల్లీ :  సమాజం ఎంత ముందడుగు వేస్తున్నా... ఎన్నిరంగాల్లో దూసుకుపోతున్నా.. మహిళలు ఉన్నతహోదాల్లో రాణిస్తున్నా.. మగాళ్లకేం తీసిపోమని రుజువు చేసుకుంటూ సత్తా చాటుతున్నా ఇంకా తరతరాలుగా నాటుకున్న పితృస్వామ్య భావజాలాల్లోకి బైటికి రాలేకపోతున్నారు. దీనికి నిదర్శనమే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించిన ఓ సర్వే. దీంట్లో వెలుగు చూసిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. ఈ సర్వేలో భర్త, భార్యను కొట్టడం కరెక్టేనని స్వయంగా మహిళలే ఆమోధించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం... వివరాల్లోకి వెడితే.. 

కొన్ని పరిస్థితుల్లో భార్యను Hitting చేయడం తప్పేమీ కాదని దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు.  Andhra Pradesh, Telanganaల్లో నైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84 శాతంగా ఉంది.  National Family Health Survey ( ఎన్ హెచ్ఎఫ్ ఎస్)-5  ఈ మేరకు వివరాలను బయటపెట్టింది.  దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. 

ఇందులో భాగంగా ‘భార్యను భర్త కొట్టడం మీ అభిప్రాయంలో సబబేనా?’ అనే ప్రశ్నను మహిళల ముందుంచారు. భార్యకు Extramarital affair ఉందని అనుమానించడం,  అత్తింటి వారిని ఆమె గౌరవించకపోవడం,  మొగుడితో వాదనకు దిగడం, భర్తతో శృంగారాన్ని నిరాకరించడం,  ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లడం,  ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మంచి ఆహారం వండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తినట్లు ఊహించుకుని సమాధానాలు చెప్పాలని వారిని సూచించారు.

 ఈ సర్వేలో తేలిన ముఖ్యాంశాలు  ఇవి..
-  మూడు రాష్ట్రాల్లో  75 శాతం పైగా మహిళలు  wifeను, husband కొట్టడం  సబబేనని అభిప్రాయపడ్డారు.  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఇలా అభిప్రాయ పడినవారి శాతం  84 శాతంగా ( సర్వేలో పాల్గొన్నవారిలో) ఉండగా..  కర్ణాటకలో  77 శాతంగా నమోదయింది.

‘75ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కులం’.. సుప్రీంకోర్టులో అంబేద్కర్ ప్రస్తావన
- మణిపూర్లో 66%, కేరళలో 52%, జమ్మూ కాశ్మీర్  49 శాతం, మహారాష్ట్రలో 44 శాతం, పశ్చిమ బెంగాల్ 42 శాతం నమోదైన ఈ సర్వేలోనూ మొగుడు చితకబాదడాన్ని సమర్ధించే స్త్రీల సంఖ్య ఎక్కువగానే ఉంది.

-  ఇంటిని, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటి వారిని గౌరవించనప్పుడు భార్యను భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు.  అత్తింటి వారిని గౌరవించక పోవడం ప్రధాన కారణంగా తెలంగాణ సహా 13 రాష్ట్రాల స్త్రీల పేర్కొన్నారు.

-  అత్యల్పంగా హిమాచల్ప్రదేశ్లో 14.8 శాతం మహిళలు  మొగుడు  కొట్టడాన్ని సమర్థించారు.

-  భార్యను భర్త కొట్టడాన్ని మహిళలతో పోలిస్తే తక్కువ మంది పురుషులు సమర్ధించడం కొసమెరుపు. 

ఇన్నేళ్ల మహిళా ఉద్యమాలు, సాధికారత.. స్వయంప్రతిపత్తి అన్నీ ఈ ఒక్క సర్వేలో తేలిన అంశాలతో అనుమానంలో పడ్డాయి. ఈ సర్వే మీద సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని హక్కుల పోరాటాలు జరిగినా ఈ పరిస్థితుల్లో మార్పు రానంతవరకు, తమ మీద జరుగుతున్న హింస సరైనదేనని మహిళలు ఒప్పుకోవడం మాననంతవరకు ఇలాంటి ఫలితాలు ఆశ్చర్యకరమైనవేమీ కాదని మహిళా సంఘాలు, నేతలు అభిప్రాయపడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios