ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్ సైట్లలో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో  టికెట్ల బుకింగ్ లో  ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. 

న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యలతో రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, యాప్ పనిచేయడం లేదు. దీంతో ఆన్ లైన్ లో రైల్వే టికెట్ల బుకింగ్ కు ఇబ్బందులు నెలకొన్నాయి. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తుందని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లో లాగిన్ అయిన సమయంలో మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ఈ -టికెటింగ్ సేవ అందుబాటులో లేదని దర్శనమిస్తుంది. దయచేసి తర్వాత ప్రయత్నించాలని సూచిస్తుంది. కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755-4090600 నెంబర్లకు ఫోన్ చేయడం లేదా etcicketsco.inctకి మెయిల్ చేయాలని రైల్వే శాఖ సూచించింది. భారతీయ రైల్వేలో ప్రతి రోజూ 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతాయి. ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ఈ టికెట్లు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ అవుతాయి. అమెజాన్, మేక్‌మైట్రిప్ వంటి అనేక ఏజెన్సీలతో ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Scroll to load tweet…

ఇవాళ తెల్లవారుజాము మూడున్నర గంటల నుండి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ డౌన్ అయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పలువురు ఫిర్యాదులు చేయడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. సాంకేతిక కారణాలతో ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో సేవలు అందించలేకపోతున్నట్టుగా ప్రకటించింది.దీంతో ఈ టికెట్ బుకింగ్ లో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 1999లో ఐఆర్‌సీటీసీని రైల్వే శాఖ ప్రారంభించింది.