కేరళ వరదలు: 8 లక్షల వాటర్ బాటిల్స్ : ఐఆర్‌సీటీసీ

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 18, Aug 2018, 5:36 PM IST
IRCTC provides water bottles to kerala flood affected places
Highlights

కేరళలో భారీ వర్షాల కారణంగా  కేరళకు అవసరమైన  రక్షిత మంచినీటిని అందిస్తున్నట్టు  రైల్వే అధికారులు ప్రకటించారు. సుమారు 8.5 లక్షల బాటిల్స్ ను కేరళకు ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ )అధికారులు  తరలిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 
 

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాల కారణంగా  కేరళకు అవసరమైన  రక్షిత మంచినీటిని అందిస్తున్నట్టు  రైల్వే అధికారులు ప్రకటించారు. సుమారు 8.5 లక్షల బాటిల్స్ ను కేరళకు ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ )అధికారులు  తరలిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

 దీంతో  కేరళకు అవసరమైన మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖకు  ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఆయా ప్లాంట్లలో వాటర్ బాటిల్స్ ను కేరళకు అత్యవసరంగా పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మంచినీటి బాటిల్స్ వివరాలు

1.పరసాలకు (40వేల బాటిల్స్)
2.పాలార్‌ (చెన్నై)80వేల బాటిల్స్
3.నాన్‌గోల్స్(ఢిల్లీ)6లక్షల బాటిల్స్
4.ధన్‌పూర్(పాట్నా)9లక్షల60వేలబాటిల్స్
5.అంబర్‌నాథ్(ముంబై) 6 లక్షలబాటిల్స్
6.ఆమేథీ నుండి 2లక్షల40వేల బాటిల్స్
7.బిలాస్‌పూర్ నుండి 2లక్షల40వేల బాటిల్స్ రక్షిత మంచినీటిని కేరళకు సరఫరా చేస్తున్నారు.

సుమారు 33లక్షల60వేల బాటిల్స్ రక్షిత మంచినీరు కేరళకు చేరుస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రకటించారు.. కేరళలో  పలు ప్రాంతాల్లో చోటు చేసుకొన్న వర్షాల కారణంగా చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో  కేరళ రాష్ట్ర ప్రభుత్వం  వినతి మేరకు  ఎప్పటికప్పుడు రక్షిత మంచినీటి బాటిల్స్ ను సరఫరా చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ అధికారులు ప్రకటించారు.

loader