కాన్పూర్ జిల్లా ఎస్పీ ఆత్మహత్యాయత్నం... కారణమిదేనా?

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 5, Sep 2018, 5:12 PM IST
ips officer suicide in uttar pradesh
Highlights

ఉత్తర ప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్  పోలీస్ విభాగంలో కలకలం రేపింది.

ఉత్తర ప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్  పోలీస్ విభాగంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు ఎస్పీగా సురేంద్ర కుమార్ దాస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతడు ఇవాళ తన అధికారిక నివాసంలోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అచేతన స్థితిలో పడివున్న అతన్ని గమనించిన సిబ్బంది స్థానిక రెజెన్సీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఇంటెన్సివ్ కేర్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. విషం శరీరమంతా  పాకిపోవడంతో ప్రస్తుతం సురేంద్ర కుమార్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

సురేంద్ర కుమార్ 2014 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఇతడు ప్రస్తుతం కాన్పూర్ ఈస్ట్రన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఇతడు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ జిల్లా ఎస్పీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది.


 

loader