ఉగ్రవాదిగా మారిన ఐపిఎస్ అధికారి సోదరుడు...కాల్పుల్లో మృతి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 22, Jan 2019, 6:15 PM IST
IPS Officer's Brother Among 3 Terrorists Killed In Kashmir Encounter
Highlights

జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ భద్రతా దళాల ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా షోపియాన్ జిల్లాలో ఎస్‌వోజీ దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తం తనిఖీలు నిర్వహిస్తున్నాయి.. ఈ క్రమంలో హెఫ్ షెర్మాల్ వద్ద ఉగ్రవాదులు భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. దీంతో ఎదురు కాల్పులకు దిగిన భద్రతా సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. 

ఈ దాడిలో చనిపోయిన ఓ ఉగ్రవాది గురించి తెలుసుని అధికారులు షాకయ్యారు. షంసూల్ మెంగ్నూ అనే ఉగ్రవాది సోదరుడు ఇనాముల్ హక్ మెంగ్నూ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో ఐపిఎస్ అధికారిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరు కలిసే స్కూల్, కాలేజి చదువు పూర్తిచేసుకున్నారు. అయితే ఒకరు దేశ రక్షణ చేపట్టే ఐపిఎస్ అధికారిగా మారగా...మరొకరు దేశద్రోహానికి పాల్పడుతూ ఉగ్రవాదిగా మారి చివరకు హతమయ్యాడు. 

ఉగ్రవాది షంసూల్ మెంగ్నూ శ్రీనగర్‌ కాలేజీలో యునానీలో మెడిసిన్ చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై కరుడిగట్టిన ఉగ్రవాదిగా మారాడు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే వేడుకల్లో విద్వంసానికి పథకరచన చేస్తూ భద్రతాదళాల కాల్పుల్లో హతమయ్యాడు. 

ఈ కాల్పుల్లో ఓ జవాన్ కూడా గాయపడగా అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన ఉగ్రవాదుల నుండి మూడు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
 
loader