New NIA Chief:  సీనియర్‌ ఐపీఎస్ అధికారి దినకర్‌ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్‌ జనరల్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది.  

New NIA Chief:  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నూత‌న‌ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ IPS అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేర‌కు గురువారం సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుప్తా పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IPS అధికారి. ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా గుప్తా నియామకానికి క్యాబినేట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయ‌న NIA డైరెక్టర్ జనరల్‌గా మార్చి 31, 2024 వ‌ర‌కు ప‌దవీలో కొన‌సాగుతారు.

మరో ఉత్తర్వులో.. స్వాగత్ దాస్‌ను హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమించారు. దాస్ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా కొన‌సాగుతున్నారు. దాస్ నవంబర్ 30, 2024 వరకు ఈ పదవి సేవ‌లందించ‌నున్నారు. 

దినకర్ గుప్తా.. పంజాబ్ డీజీపీగా సేవ‌లందించారు. గుప్తా, 1987 బ్యాచ్ IPS అధికారి, అదే బ్యాచ్‌కు చెందిన మరో ముగ్గురు అధికారులలో అత్యంత సీనియర్, వీరి పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ వారం ప్రారంభంలో ఉన్నత పదవికి నియమించడానికి సూచించింది. గుప్తా చాలా కాలంగా పంజాబ్‌లో ఉన్నారు. అతను పంజాబ్‌లోని లూథియానా, జలంధర్, హోషియార్‌పూర్ జిల్లాలకు సుమారు 7 సంవత్సరాలుగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)గా ఉన్నారు. పంజాబ్‌లో ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్యగా ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాప‌డాన్ని సవాలుగా స్వీకరించారు.

పంజాబ్‌లో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా పనిచేస్తున్నప్పుడు, ఆయ‌న‌ తన భార్య కింద కూడా పనిచేశాడు. దినకర్ గుప్తా భార్య అయిన వినీ మహాజన్ అప్పటి పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. భార్యాభర్తలిద్ద‌రూ రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉండడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. వినీ మహాజన్ తొలిసారిగా పంజాబ్ తొలి మహిళా కార్యదర్శిగా నియ‌మితుల‌య్యారు. భార్యాభర్తలిద్దరూ 1987 బ్యాచ్‌కి చెందిన అధికారులే విశేషం.