Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌ పాలిటిక్స్‌లోకి ఐపీఎస్ అధికారి? బసంత్ రత్ ఎవరూ?

జమ్ము కశ్మీర్ పాలిటిక్స్‌లోకి ఓ ఐపీఎస్ అధికారి ఎంటర్ కాబోతున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎస్ అధికారి బసంత్ రత్ తాను.. ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తన రాజీనామా పత్రంలో రాశాడు. ఇంతకు బసంత్ రత్ ఎవరు?
 

IPS Officer basant rath to enter jammu kashmir politics
Author
New Delhi, First Published Jun 26, 2022, 7:00 PM IST

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి గతంలో ఐఏఎస్ అధికారి షా ఫైజల్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యాక ఆర్టికల్ 370 రద్దు.. ఆ తర్వాత కరోనా పరిస్థితులతో ఆయన పొలిటికల్ కెరీర్ దెబ్బతినింది.  దీంతో ఆయన తిరిగి సర్వీసులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన రాజీనామాను ఉపసంహరించుకుని ఈ ఏడాది మొదట్లోనే మళ్లీ ఐఏఎస్‌ సర్వీసులోకి వెళ్లాడు. ఇదిలా ఉండగా, తాజాగా, ఓ ఐపీఎస్ అధికారి జమ్ము కశ్మీర్ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. ఐపీఎస్ అధికారి బసంత్ రత్ తన రాజీనామాను సమర్పించాడు. అందులోనే తాను రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నట్టు సూచనలు ఇచ్చాడు.

సరైన తీరులో వ్యవహరించలేదని, తరుచూ ఆయన అసంబద్ధంగా వ్యవహరించాడని పేర్కొంటూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ 2000 జులైలో బసంత్ రత్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నాడు. సస్పెన్షన్ కాలంలో జమ్ము కశ్మీర్ విడిచి వెళ్లరాదని తెలిపింది.

తాజాగా బసంత్ రత్ తాను ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు, ఈ విజ్ఞప్తినే రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణగా స్వీకరించాలని పేర్కొన్నారు. చీఫ్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఈ లేఖకు ముందు ఆయన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. తాను ఒక వేళ రాజకీయ పార్టీలో చేరితే.. అది బీజేపీనే అని స్పష్టం చేశారు. ఒక వేళ తాను ఎన్నికల్లో పోటీ చేస్తే.. అది కశ్మీర్ నుంచే చేస్తానని వివరించారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి చేరితే అది 2024 మార్చి 6వ తేదీలోపే చేరుతానని పేర్కొన్నారు.

బసంత్ రత్ ఎవరు?
బసంత్ రత్ 1972లో జన్మించారు. ఒడిశా పూరి జిల్లా పిప్లిలో జన్మించారు. ఆయన తండ్రి గ్రామ పూజారి, రైతు. 2002 నుంచి ఆయన జమ్ము కశ్మీర్‌లోని మండిలో ఐపీఎస్ అధికారిగా అపాయింట్ అయ్యారు. ఆయన ప్రొబేషన్ పిరియడ్‌లో ఉన్నప్పుడు విద్యార్థులకు బుక్స్ పంచి పెట్టేవాడు. 2002 చివరికల్లా ఈ పుస్తకాల పంపిణీ విస్తృత సంతరించుకుంది. తర్వాత ఆయనకు బుక్స్ బాబా అనే పేరు కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన నీట్, జేఈఈ అభ్యర్థులనూ చేరుకుని పుస్తకాలు పంపేవాడు. 

జేఎన్‌యూలో చదువుకున్న బసంత్ రత్ జమ్ము కశ్మీర్ ఐజీపీగా సేవలు అందించారు. ఆయన 2000 ఐపీసీఎ క్యాడర్ ఆఫీసర్.

Follow Us:
Download App:
  • android
  • ios