ఐపిఎల్ బెట్టింగ్ కేసులో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, దావూద్ గ్యాంగ్ తో లింక్?

IPL betting: Actor Arbaaz Khan summoned by Thane police
Highlights

అర్బాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేసిర థానే పోలీసులు

ఐపిఎల్ బెట్టింగ్ స్కాం మరోసారి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ బెట్టింగ్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, ప్రొడ్యూసర్ అర్బాజ్ ఖాన్ చిక్కుకున్నాడు.  ఈ బెట్టింగ్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర లోని థానే పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. బెట్టింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అర్బాజ్ ఖాన్‌కు నోటీసులు జారీ చేశారు.

ఈ తాజా వ్యవహారంతో మరోసారి బాలీవుడ్ షేక్ అవుతోంది. ఈ బెట్టింగ్ కేసులో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు బాశిస్తున్నారు. ఇందుకోసం లోతుగా విచారించడానికే అర్బాజ్ ను తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.  

ఈ బెట్టింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం కూడా ఉన్నట్లు వార్తతు వినబడుతున్నాయి.  బుకీలద్వారా అర్బాజ్ ఖాన్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులకు దొరికిన ఓ బూకీ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరును బయట పెట్టినట్లు తెలియవచ్చింది.  

 గత నెల 16న థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దోంబివిలిలో బెట్టింగ్ జరుగుతున్న ప్రదేశంపై దాడి చేసి ముగ్గురు బుకీలను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకడైన సోనూ జలన్ అనే బుకీని విచారించగా అర్బాజ్ పేరు బయటకు వచ్చింది. దీంతో అర్బాజ్ వివరణ తీసుకోవాలని థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ణయించారు. బుకీల ద్వారా అర్బాజ్ ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఈ ముగ్గురు బుకీల ఆధ్వర్యంలో ఏడాదికి 100 కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ వెల్లడించారు.
 
 

loader