Asianet News TeluguAsianet News Telugu

ఇండియా మార్కెట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ప్రో మోడల్స్.. ప్రారంభ ధర రూ. 79,900

ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్, ప్రో మోడల్స్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇవి మన దేశంలోనూ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 79,900గా ఉన్నది. ఈ మోడళ్ల ధరలు సమగ్రంగా తెలుసుకోండి.
 

iPhone 14 generation mobile phones launched by apple.. in india price starts from rs 79,900
Author
First Published Sep 8, 2022, 3:16 AM IST

న్యూఢిల్లీ: యాపిల్ సంస్థ కొత్త తరం ఐఫోన్లును లాంచ్ చేసింది. కొత్త జెనరేషన్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది లాగే.. ఈ సారి కూడా కంపెనీ నాలుగు మోడళ్లను చిన్న చిన్న మార్పులతో మార్కెట్‌లోకి తెచ్చింది. రెగ్యులర్ లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఉన్నది. గతంలో ఈ లైనప్2లో మినీ వర్షన్ తెచ్చింది. ప్రో సిరీస్2లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను ముందుకు తెచ్చింది. బెస్ట్ ఫీచర్లను ప్రో సిరీస్‌లో ఉంచింది. కాగా, రెగ్యులర్ మోడల్స్.. ఐఫోన్ 13 లైనప్‌లో స్వల్ప మార్పులతో ముందుకు వచ్చింది. కాబట్టి, ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఐఫోన్ 13 సిరీస్ మొబైల్‌ల ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. అదే ప్రో వేరియంట్లు మాత్రం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి.

కొత్త జెనరేషన్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79, 900లుగా ఉన్నది. మిగితా ఐఫోన్ ధరలు కూడా చూద్దాం.

ఐఫోన్ 14 : రూ. 79,900 (128 జీబీ), రూ. 89,900 (256 జీబీ), రూ. 1,09,900 (512 జీబీ) 
ఐఫోన్ 14 ప్లస్ : రూ. 89,900 (128 జీబీ), రూ. 99,900 (256 జీబీ), రూ. 1,19,900 (512 జీబీ)
ఐఫోన్ 14 ప్రో: రూ. 1,29,900 (128 జీబీ), రూ. 1,39,900 (256 జీబీ), రూ. 1,59,900 (512 జీబీ),
రూ. 1,79,900 (1 టీబీ)
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్: రూ. 1,39,900 (128 జీబీ), రూ. 1,49,900 (256 జీబీ), రూ. 1,69,900 (512
జీబీ), రూ. 1,89,900 (1 టీబీ)లుగా ఉన్నాయి.

ఓ సారి ఐఫోన్ 13 మార్కెట్‌లోకి వచ్చినప్పటి ధరలు పరిశీలిస్తే.. రెగ్యులర్ లైనప్‌లో పెద్దగా తేడలేదని అర్థం అవుతుంది. గతేడాది ఐఫోన్ 13 స్టార్టింగ్ ప్రైస్ రూ. 79,900 (128 జీబీ స్టోరేజీ). కాగా, ఐఫోన్ 13 ప్రో ధర రూ. 1,19,900 (128 జీబీ స్టోరేజీ). ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర స్టార్టింగ్ రూ. 1,29,900 (128 జీబీ) గా ఉన్నది.

యాపిల్ ఇండియా వెబ్‌సైట్ 13 ప్రో మ్యాక్స్‌ పై ఈఎంఐ పద్ధతిలో చెల్లింపులు కట్టుకోవచ్చని తెలిపింది. ప్రీ ఆర్డర్‌లు రేపటి నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఐఫోన్ 14 అమ్మకాలు సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానున్నాయి. ప్లస్ వేరియంట్ అక్టోబర్ 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. కాగా, ప్రో మోడల్స్ అమ్మకాలు సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానున్నాయి. యాపిల్ ఫోన్‌లలోని ప్రాసెసర్‌లో స్వల్ప మార్పులతో కొత్త జెనరేషన్ మొబైల్ వచ్చింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో 13 మోడల్స్‌లో వాడిన ఏ 15 బయోనిక్ చిప్‌సెట్‌ను కొంత మార్పులతో ఇందులో పెట్టారు. కాగా, ప్రో మోడల్స్ మాత్రం ్ొతంత ఏ16 బయోనిక్ చిప్‌సెట్ వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios