ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరానికి మళ్లీ షాక్ తగిలింది. ఈ నెల 17 వరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగించింది. అయితే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు మాత్రం అనుమతించింది. ఇప్పటికే ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. దీనికి ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్ తిరస్కరించింది.

కాగా ఈ కేసులో సీబీఐ విచారణ అనంతరం కోర్టు చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన నెల నుంచి తీహార్ జైలులోనే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో చిదంబరం తరపు న్యాయవాది పిటిషన్ వేశారు.