అసలు స్నేహానికి చోటు కాదు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో నోటీస్ బోర్డులో పెట్టారు. అంతేకాదు పని సమయంలో పనికి రాని చర్చలు పెట్టుకుంటూ కూర్చుంటే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం గమనార్హం
స్నేహం ఎప్పుడు ఎలా మొదలౌతుందో ఎవరూ చెప్పలేరు. కొందరికి స్కూళ్లో స్నేహం ఏర్పడొచ్చు. మరి కొందరకి కాలేజీలో స్నేహం ఏర్పడచ్చు. మరి కొందరికి ఆఫీసులో స్నేహితులవ్వచ్చు. ఎక్కడ, ఎక్కడ, ఎవరితో స్నేహం చేయాలో మనకు ఎవరూ చెప్పరు. మన అభిప్రాయలు, వ్యక్తిత్వం నచ్చితే స్నేహం చేస్తాం. ఎవరితో స్నేహం ఎక్కడ చేయాలో చెప్పే హక్కు ఎవరికీ ఉండదు. అయితే ఓ కంపెనీ మాత్రం రూల్ పెట్టింది. తమ కార్యాలయంలో ఉద్యోగులు స్నేహం చేయకూడదట.
నిజానికి ఉద్యోగుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉన్నప్పుడే పని సక్రమంగా జరుగుతుంది. అలా కాకుండా, వారి మధ్య స్నేహం లేకుండా, ఒకరితో మరొకరికి మాటలు లేకపోతే ఏ విషయమైనా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? ఈ చిన్న లాజిక్ మిస్ అయిన ఓ సంస్థ.. తమ ఆఫీసులో ఉద్యోగులు స్నేహితులుగా ఉండకూడదని, అసలు స్నేహానికి చోటు కాదు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో నోటీస్ బోర్డులో పెట్టారు. అంతేకాదు పని సమయంలో పనికి రాని చర్చలు పెట్టుకుంటూ కూర్చుంటే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం గమనార్హం దానిని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.
దానిని చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదెక్కడి కంపెనీ అని, ఇలాంటి రూల్స్ కూడా పెడతారా అంటూ విమర్శిస్తున్నారు. చాలా కొద్ది మద్ది మాత్రం దీనిని కూడా సపోర్ట్ చేయడం గమనార్హం. అయితే ఇది ఏ కంపెనీ, ఎక్కడ అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.
