న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో అనధికారిక సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ మామల్లాపురం వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. మహాబలిపురం బీచ్ లో ప్రధాని చెత్త ఏరి ఒక సోషల్ మెసేజ్ ను కూడా భారతదేశ ప్రజలకు అందించారు. 

ప్రధాని చేత్తేరుతున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ను చూసిన చాల మందికి ఒక డౌట్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో పట్టుకున్న వస్తువేంటని. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. టార్చ్ లైట్ అని కొందరంటే, కాదు డంబెల్ అని మరికొందరు ఇలా ఎవరికీ తోచిన సమాధానాన్ని వారు పోస్ట్ చేసారు. 

ఈ అనుమానం కేవలం నెటిజన్లకు మాత్రమే కలగలేదు. మోడీ సన్నిహితులకు కూడా కలిగిందట. ఇంతమందికి ఆ ప్రత్యేక పరికరం పై కలిగిన ప్రత్యేక అనుమానాలను తొలగించేందుకు నేరుగా ప్రధాని మోడీయే సమాధానమిచ్చారు. 

ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ అనుమాలన్నంటికీ తెరదించుతూ ఈ విధంగా పోస్టు పెట్టారు. " నేను బీచ్ లో చెత్త ఎత్తుతున్నప్పుడు నా చేతిలోని ప్రత్యేక పరికరమేంటనే ప్రశ్నను చాలామందడిగారు. అది ఆక్యుప్రెజర్ రోలరు. నేను దాన్ని తరచు వాడుతుంటాను. నాకది ఎంతో మేలుచేసింది" అని తెలిపారు. 

ఆక్యు ప్రెజర్ అనేది ఆక్యు పంక్చర్ వైద్యానికి దెగ్గరగా ఉంటుంది. తూర్పు ఆసియాలో ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలోఉంది. ఈ రోలరు చేతిలో ఇమిడిపోతుంది. దీన్ని వాడడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.