Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు పొడగింపు..

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

International commercial passenger flights to remain suspended till December 31  - bsb
Author
Hyderabad, First Published Nov 26, 2020, 5:01 PM IST

అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశీయ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) గురువారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డిజిసిఎ చేత ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవు అని అధికారిక సర్క్యులర్ తెలిపింది.

ఈ యేడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్ లో పాక్షిక మార్పులు చేశామని,  ఈ సర్క్యూలర్ గడువును 2020 డిసెంబర్ 31, అర్థరాత్రి 23 గంటల 59ని.ల వరకు పొడిగించామని తెలిపింది. భారతదేశానికి / భారతదేశానికి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలకు సంబంధించి పైన పేర్కొన్న అంశంపై జారీ చేసిన సర్క్యులర్ ప్రామాణికతను మరింత పెంచిందని డిజిసిఎ సర్క్యులర్‌లో తెలిపింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios