పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబరేటరీలో రీసెర్చర్ గా పనిచేసే ఓ సుదర్శన్ పండిట్ ని రవిరాజ్ కృష్ణసాగర్ అనే ఇంటరీయర్ డిజైనర్ అతి దారుణంగా హత్య చేశారు.
వారిద్దరికీ డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. అయితే.. వారిలో ఒకరు పెళ్లికి సిద్ధపడ్డారు. అంతే.. తనను కాదని.. తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక హత్య చేశాడు.
ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో పోలీసులు ఓ ఇంటీరియర్ డిజైనర్ ని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబరేటరీలో రీసెర్చర్ గా పనిచేసే ఓ సుదర్శన్ పండిట్ ని రవిరాజ్ కృష్ణసాగర్ అనే ఇంటరీయర్ డిజైనర్ అతి దారుణంగా హత్య చేశారు. అతనిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. కాగా.. అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వీరిద్దరూ అబ్బాయిలే అయినప్పటికీ స్వలింగసంపర్కులు. వీరిద్దరికీ ఓ డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఇష్టపడ్డారు. కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అయితే... వీరిలో రీసెర్చర్ సుదర్శన్ పండిట్ పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంటీరియర్ డిజైనర్ రవిరాజ్ కృష్ణసాగర్ తట్టుకోలేకపోయాడు.
తనని కాదని వేరే అమ్మాయితో పెళ్లి సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అంతే.. ప్రియుడు సుదర్శన్ ని అతి దారుణనంగా చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. రవిరాజ్ ప్రాణాలతో బయటపడగా.. పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తాను చేసిన నేరం అంగీకరించాడని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
