కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరికాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల కోసం దేశప్రజలు నెట్టింట్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆ విషయాలను ఒకసారి గమనిస్తే.. 

* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పండిట్ నెహ్రూ కేబినెట్‌లో తొలి ఆర్దిక మంత్రిగా పనిచేసిన ఆర్కే షణ్ముఖం చెట్టి, 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

* ఇప్పటి వరకు అత్యధికంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి మొరార్జీ దేశాయ్. ఆయన మొత్తం పది సార్లు ఈ ఘనత సాధించారు. మొరార్జీ దేశాయ్ తర్వాత పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

* బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్ధిక మంత్రి ఇందిరాగాంధీ

* 1998 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలోని చివరి పనిదినంలో సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టారు. 

* 1999లో వాజ్‌పేయ్ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పులు చేశారు. అప్పటి నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలోని చివరి పనిదినంలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతూ వస్తున్నారు.

* నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీని ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

* 2016 వరకు రైల్వే బడ్జెట్‌, కేంద్రబడ్జెట్‌‌ ను వేరుగా ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుంచి కేంద్రబడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలిపేశారు.