Asianet News TeluguAsianet News Telugu

ఏకే రావు అనుమానాస్పద మృతి కేసు : తెరపైకి రూ.150 కోట్ల డీల్... ముగ్గురిపై కుటుంబసభ్యుల అనుమానం

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో బెంగళూరు రైల్వే పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గిరిష్ అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సిద్ధగుంటపాళీ పీఎస్‌లో నమోదైన రూ.150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు.  డానియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్‌లపై ఏకే రావు  కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

interesting details in  singer harini father ak rao mysterious death case
Author
Bangalore, First Published Nov 26, 2021, 2:35 PM IST

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో బెంగళూరు రైల్వే పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గిరిష్ అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సిద్ధగుంటపాళీ పీఎస్‌లో నమోదైన రూ.150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అలాగే ఏకే రావును వేధింపులకు గురిచేసిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనితో పాటు ఏకే రావు కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేయనున్నారు. డానియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్‌లపై ఏకే రావు  కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.150 కోట్ల వ్యవహారంలో గిరీష్ మధ్యవర్తిత్వంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు సెల్‌ఫోన్ డేటా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తుండటంతో దానిని విశ్లేషిస్తున్నారు. మరోవైపు నేడు పోలీసులు ఎదుట ఏకే రావు  కుటుంబసభ్యులు హాజరుకానున్నారు.

కాగా.. తండ్రి ఏకే రావు (ak rao) అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 23వ తేదీన బెంగళూరు (bangalore) శివార్లలోని (yelahanka) యలహంక -రాజన్న కుంట రైల్వే స్టేషన్‌ల మధ్య ఏకే రావు మృతదేహం కనిపించింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కో పైలట్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి, గొంతుపైనా గాయాలు వున్నట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో చాకు, కత్తి, బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎమ్మెస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. మృతుడి దగ్గర వున్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

ALso Read:ఈ నెల 8న బెంగళూరుకి.. 23న శవమై తేలిన ఏకే రావు, ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి అక్కడ లభ్యమైన మృతదేహం తన తండ్రిదేనని గుర్తించారు. అతను ఒక ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరు వస్తుంటాడు. ఈ నెల 8న అక్కడికి వచ్చిన ఏకే రావు.. తన కుమారుడి ఇంట్లోనే వున్నాడు. 23న ఏకే రావు భార్య.. బెంగళూరులో వున్న కుమారుడికి ఫోన్ చేశారు. భర్త చనిపోయినట్లు, రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, రైల్వే ట్రాక్‌పై మృతదేహం వున్నట్లుగా చెప్పారని కుమారుడికి సమాచారం ఇచ్చారామె. ఒంటిపై వున్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో 174 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

మరోవైపు ఏకే రావు మృతిపై హైద్రాబాద్ సీపీ (hyderabad police commissioner) అంజనీకుమార్ (anjani kumar) స్పందించారు. ఏకే రావు కుటుంబం అదృశ్యమైనట్టుగా కూడా తమకు సమాచారం లేదన్నారు. ఈ విషయమై తమకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన తెలిపారు. బెంగుళూరు పోలీసుల నుండి కూడా తమకు సమాచారం లేదని Anajani kumar చెప్పారు..  ఈ విషయమై బెంగుళూరు పోలీసుల నుండి సమాచారం తెప్పించుకొని విచారణ  చేస్తామని Hyderabad CP తెలిపా
 

Follow Us:
Download App:
  • android
  • ios