ఇటీవల హర్యానాలోని నూహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఓ భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ వర్గం వారిపై రాళ్ల దాడి చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, వందలాది గాయపడ్డారు. ఈ దాడుల వల్ల నూహ్ జిల్లా వారం రోజుల పాటు అట్టుడికింది.
నుహ్ అల్లర్ల సమయంలో తనకు సహాయం చేయమని జిల్లా జడ్జి అభ్యర్థించడం తో మేవాత్ కోర్టు న్యాయవాది రంజాన్ చౌదరి వెనుకాడకుండా.. తల్లి, కుమార్తెను రక్షించారు. మేవాత్ న్యాయవాది, ప్రముఖ సామాజిక కార్యకర్త రంజాన్ చౌదరి జూలై 31 నాటి ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ వణికిపోతారు. ఆయన 'ఆవాజ్ ది వాయిస్'తో మాట్లాడుతూ.. ఓ బాధాకరమైన ఘటనను వివరించారు.
“ ఆనాడు మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో.. అకస్మాత్తుగా జిల్లా సెషన్స్ జడ్జి సుశీల్ గార్గ్ కోర్టు గదిని వదిలి తన ఛాంబర్‌కి వెళ్లారు. జిల్లా సెషన్స్ జడ్జి ప్యూన్ తన డ్రైవర్‌ను కారును బయటకు తీయమని అడిగాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఆయన దగ్గరకు వచ్చి జడ్జి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. రంజాన్ చౌదరి DJ ఛాంబర్‌కు చేరుకునే సమయానికి జిల్లా సెషన్స్ జడ్జి చాలా ఇబ్బందిగా కనిపించారు.
మేజిస్ట్రేట్ అంజలి జైన్ తన ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి మందులు తీసుకోవడానికి నల్హార్ ఆసుపత్రికి వెళ్లింది. అల్లరిమూకలు వారిని అన్ని వైపుల నుంచి ముట్టడించారు. అల్లర్లు వారిని బందీలుగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. మేజిస్ట్రేట్ ఎలాగోలా తన కూతురుతో సహా తప్పించుకుని రోడ్‌వేస్ వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. వారిని ఎలాగైనా రక్షించి బయటకు తీసుకురావాలని DJ తనను అభ్యర్థించాడని రంజాన్ చెప్పాడు.
ఇది విని తనకు కాళ్ళు, చేతులు ఆడలేదనీ, తన స్నేహితుల్లో ఒకరు జుబేర్ వర్క్‌షాప్ దగ్గర నివసిస్తున్నారని రంజాన్ చౌదరి గుర్తు చేసుకున్నారు. తాను వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి.. జరిగిన విషయమంతా చెప్పి.. మేజిస్ట్రేట్ అంజలి జైన్, ఆమె కుమార్తెను అల్లర్ల నుండి ఎలాగైనా వర్క్‌షాప్ నుండి సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరినట్టు రంజాన్ చౌదరి చెప్పుకొచ్చారు.
తాను చెప్పినట్టే తన స్నేహితుడు జుబేర్ వెంటనే నలుగురి, ఆరుగురు వ్యక్తులతో తన టెర్రస్‌కు చేరుకున్నాడని రంజాన్ చౌదరి చెప్పాడు. మెజిస్ట్రేట్ అంజలి జైన్ ను గుర్తించి.. మీరు భయపడవద్దు, వారు క్షేమంగా ఉన్నారని, వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని అతడు చెప్పాడని రంజాన్ తెలిపారంట. ఈ క్రమంలో మేజిస్ట్రేట్ అంజలి జైన్, ఆమె కుమార్తెను వారు సురక్షితంగా రక్షించారు.
ఆ సమయంలో నగర వాతావరణాన్ని చూసిన అంజలి జైన్ ఒక్కసారిగా నమ్మలేకపోయిందని రంజాన్ చౌదరి చెప్పారు. అయితే అక్కడ ఆమెకు ఎవరూ తెలిసిన వాళ్లు లేకపోవడంతో ఎవరితోనూ మాట్లాడానికి ఇష్టపడలేదనీ, ఈ క్రమంలో ఆమె నిచ్చెన ఎక్కి జుబేర్ పైకప్పుకు వెళ్లడానికి నిరాకరించిందంట. తన స్నేహితుడు రంజాన్ చౌదరి .. తనకు ఫోన్‌లో ప్రతిదీ చెప్పాడని జుబేర్ తెలిపారంట. ఇది విన్న జిల్లా సెషన్స్ జడ్జి తనను అక్కడికి వెళ్లమని, వారిని నుంచి రక్షించమని కోరిందంట.
రంజాన్ చౌదరి ది వాయిస్‌తో మాట్లాడుతూ.. ఆ సమయంలో నగరంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి, అయినా.. తన కారులో రోడ్‌వేస్ వర్క్‌షాప్ వైపు వెళ్లినప్పుడు.. నగరం మొత్తం అల్లర్లమూకల నియంత్రణలో ఉంది. తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రోడ్లపై వాహనాలు దగ్ధమయ్యాయి. ఎక్కడా పోలీసులు లేరు. ఇంతలో కొందరు కర్రలు, రాడ్లతో తన కారు చుట్టూ ముట్టారని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని తనని బెదిరించారని రంజాన్ చౌదరి తెలిపారు. ఈ క్రమంలో ఆందోళనకారులతో వాగ్వాదం జరిగిందని తెలిపారు.
రంజాన్ చౌదరి మాట్లాడుతూ.. వారి దూకుడు వైఖరిని చూసిన తర్వాత.. ఒకానొక సమయంలో ఆందోళనకు గురయ్యాననీ, వారిని రక్షించబడిన తర్వాత ఇంటికి తిరిగి రాలేనని తాను భావించనని తెలిపారు. ఇంతలో ఆ గుంపులో ఎవరో అతన్ని గుర్తించి ముందుకు వెళ్ళడానికి అనుమతించారు.తాను వర్క్‌షాప్ దగ్గరకు చేరుకునే సరికి, తన ఎదురుగా జనం ఉన్నారని రంజాన్ చౌదరి చెప్పారు. ఇంతలో అతని స్నేహితుడు జుబేర్ కూడా తన ఇరుగుపొరుగు వారితో పాటు అక్కడ నిలబడి కనిపించాడు. రంజాన్ అతనితో కలిసి వర్క్‌షాప్ లోపలికి వెళ్లాడు.
మేజిస్ట్రేట్ అంజలి జైన్, ఆమె కుమార్తెను కలిశారు. అతనికి భరోసా లభించింది. అనంతరం జిల్లా సెషన్స్ జడ్జితో ఫోన్‌లో మాట్లాడేలా చేశారు. అంజలి జైన్ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడంతో, ముగ్గురినీ నిచ్చెన ద్వారా జుబేర్ టెర్రస్‌పైకి తీసుకువచ్చారు. తర్వాత వీధుల గుండా తీసుకెళ్లి అడ్వకేట్ ముజీబ్ ఇంటికి చేరుకున్నారు.
అనంతరం.. ADG మమతా సింగ్‌కు ఫోన్‌లో మొత్తం సమాచారం అందించారు. మమతా సింగ్‌తో అంజలి జైన్ మాట్లాడుతూ.. రంజాన్ చౌదరి, అతని న్యాయవాది సహచరులు తనను, తన కుమార్తె జీవితాన్ని ఎలా రక్షించారో చెప్పారు. వారు లేకపోతే.. తాను బతికి ఉండేదానిని కాదని అంజలి జైన్ తెలిపారు.
దీని తర్వాత మేజిస్ట్రేట్ అంజలి జైన్, ఆమె కుమార్తె , ఆమె పిఎస్‌ఓను వాహనంపై కూర్చోబెట్టారు. రంజాన్ చౌదరి స్వయంగా డ్రైవింగ్ చేస్తూ.. వారిని రక్షించారు. జూలై 31 నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. రంజాన్ చౌదరి ఆ రోజు మేవాత్ చరిత్రలో అత్యంత దారుణమైన రోజు గా అభివర్ణించారు.
అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలమ్యారని రంజాన్ చౌదరి అంటున్నారు. ప్రాణాలను కాపాడిన వారి ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారని, కజారియా టైల్స్ యజమాని ఇల్లు కూడా కూల్చివేయబడిందని, అల్లర్ల నుండి వారిని రక్షించడానికి అతను తన ఇంట్లో ఇద్దరు అధికారులకు ఆశ్రయం ఇచ్చాడని చెప్పాడు. దీనిపై ఆ ఇద్దరు అధికారులు వాంగ్మూలం ఇచ్చినా ఎవరూ వినలేదని వాపోయారు. మేజిస్ట్రేట్ అంజలి జైన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో ఆమె ప్రాణాలను రక్షించడంలో న్యాయవాదుల పాత్ర ఉందని ఆమె తెలిపారు.
