Asianet News TeluguAsianet News Telugu

కబీర్ సింగ్ సినిమా చూసి.. అందులో హీరోలాగా..

ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి కబీర్‌ సింగ్‌ సినిమాలోని ఆర్థోపెడిక్‌ సర్జన్‌‌ షాహిద్‌ కపూర్‌‌ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్‌ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్‌ గుజరాల్‌ అనే మారుపేరుతో టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా అమాయక యువతులకు ఎర వేయసాగాడు. 

Inspired by movie Kabir Singh, man dates women by posing as doctor, held
Author
Hyderabad, First Published May 30, 2020, 11:45 AM IST

అర్జున్ రెడ్డి ఈ సినిమా చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా స్ఫూర్తితో  బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమా తెరకెక్కించారు. కాగా... ఇప్పుడు ఆ సినిమా ని చూసి ఓ యువకుడు అందులో హీరోలా రెచ్చిపోయాడు. తాను డాక్టర్ నని నమ్మించి అమ్మాయిలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి కబీర్‌ సింగ్‌ సినిమాలోని ఆర్థోపెడిక్‌ సర్జన్‌‌ షాహిద్‌ కపూర్‌‌ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్‌ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్‌ గుజరాల్‌ అనే మారుపేరుతో టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా అమాయక యువతులకు ఎర వేయసాగాడు. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్‌ అతడి వలలో చిక్కింది.

ఇద్దరి మధ్యా చాటింగ్‌ మొదలైంది. కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అతడ్ని పూర్తిగా నమ్మిన సదరు యువతి దాదాపు 30వేల రూపాయలు అతడి అకౌంట్‌కు బదిలీ చేసింది. 

కొద్దిరోజుల తర్వాత ఆ యువతి ఆనంద్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. ఆమెకు చెందిన ప్రైవేట్‌ చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, అతడిపై పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్‌తో పాటు అతడికి సహకరిస్తున్న మరో యువకుడ్ని అరెస్ట్‌ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios