Delhi: ముంబై పోలీసులు లాగా నటిస్తూ దోపిడీకి పాల్పడిన ఏడుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దోపిడి మొత్తంతో పాటు నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనే విషయంపై విచారణ జరుగుతోంది.
Delhi: సినిమా ఫక్కీలో చోరీకి పాల్పడిన ఏడుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన సుభాష్ ప్లేస్ దోపిడీ కేసులో ఈ నిందితుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో నిందితులు ప్రశాంత్ కుమార్ పాటిల్, జాహిద్, జ్యోతి, నేహా, ఇమ్రాన్, ఫైసల్, సంజయ్‌ల వద్ద నుంచి రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకోగా.. దాదాపు రూ.2 లక్షలకు పైగా వారి ఖాతాల్లో జమ అయినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి లూటీ చేసిన ల్యాప్‌టాప్‌లు, 35 మొబైల్స్, సిమ్ కార్డులు, ముంబై పోలీసుల నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఈ కేసులో అరెస్టు అయినా వారిలో ఇద్దరు నిందితులు మధ్యప్రదేశ్‌లో గతంలో జరిగిన రెండు వేర్వేరు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులందరూ జైలులో ఉండగానే దోపిడీకి కుట్ర పన్నినట్టు తెలుస్తుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆగస్ట్ 10, 2022 న, విజయ్ యాదవ్ అనే బాధితుడు దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఒక వెల్నెస్ కంపెనీ యజమాని, అతని కార్యాలయం నేతాజీ సుభాష్ ప్లేస్ కాంప్లెక్స్‌లో ఉంది. విజయ్ తన ఉద్యోగులతో కలిసి కంపెనీ కార్యాలయంలో ఉన్నప్పుడు.. విచారణ సాకులో ముంబై పోలీసులు లాగా నకిలీ గుర్తింపు కార్డులు ధరించి 3 వ్యక్తులు, ఒక మహిళ తన కంపెనీ కార్యాలయంలోకి ప్రవేశించారని విజయ్ పోలీసులకు చెప్పాడు.
అనంతరం వారు తనపై దాడి చేసి.. ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి డబ్బులు విషయం చెప్పడంతో .. ఆమె ఎలాగోలా రూ.5 లక్షలు ఏర్పాటు చేసింది. నిందితులు ఆమెను డబ్బులు లాక్కొని తీసుకెళ్లారు. ఇదే సమయంలో నిందితుడి కార్యాలయం నుంచి 5 లక్షల 75 వేల రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్‌టాప్, మరో 45 వేల నగదును తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పలు చోట్ల దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో ప్రత్యేక బృందం ఢిల్లీలోని లిబాస్పూర్ పాంత్రంలో 29 ఏళ్ల ప్రశాంత్ కుమార్ పాటిల్‌ను పట్టుకుంది. పోలీసుల విచారణలో ప్రశాంత్ తన ప్రమేయాన్ని బయటపెట్టాడు. ఇద్దరు మహిళలతో సహా మరో 7 మంది నిందితులతో కలిసి ఈ దోపిడీలో పాల్గొన్నట్లు ప్రశాంత్ తెలిపాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షల 48 వేల 500 స్వాధీనం చేసుకున్నారు.
దీని తరువాత, రోహిణి ఢిల్లీకి చెందిన జ్యోతి అలియాస్ అంజలి, నేహా కశ్యప్ అనే నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బాధితుడి ల్యాప్‌టాప్, 10 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ ముంబై పోలీసు గుర్తింపు కార్డులు, నకిలీ ఏటీఎం కార్డులు, ఫినో పేమెంట్స్ బ్యాంక్ పేరుతో ఉన్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కిట్‌లతో సహా మరో 25 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల విచారణ ఆధారంగా జాహిద్ అలియాస్ గురు జీ, సంజయ్ మనోచా అనే మరో ఇద్దరు నిందితులు హర్యానాలోని మేవాత్‌కు, మరో ముగ్గురు మజీద్, ఫైసల్, ఇమ్రాన్ విదిషా భోపాల్‌కు
పరారీ అయ్యారని పోలీసుల విచారణలో తేలింది. వీరిని పట్టుకోవడానికి హర్యానా, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడుల కోసం ప్రత్యేక సిబ్బంది వెళ్లింది. సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌ల రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
72 గంటల్లో ఏడుగురు నిందితుల అరెస్ట్
దాడి చేసిన తరువాత, హర్యానాలోని మేవాత్‌లో నివసిస్తున్న 43 ఏళ్ల నిందితుడు జాహిద్‌ను హర్యానాలోని మేవాత్ నుండి పోలీసు బృందం అరెస్టు చేసింది. నిందితుడు ఇమ్రాన్‌ను సిరోంజ్‌లో, విదిషా ఫైసల్ లను భోపాల్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు సంజయ్‌ను ఢిల్లీలోని పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 72 గంటల్లో.. ఈ దోపిడీకి పాల్పడిన 8 మంది నిందితులలో 7 మందిని పట్టుకున్నారు. వారి నుంచి దోచుకున్న నగదు, ఇతర వస్తువులను రికవరీ చేశారు.
విచారణలో నిందితులందరూ ఈ సంఘటనలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు. వారు తమ వివిధ లింక్‌ల ద్వారా ఒకరికొకరు పరిచయం చేసుకున్నారని తెలిపారు. బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ 26'తో ప్రభావితులై ఈ దోపిడీకి పథకం వేసినట్టు నిందితులు చెప్పుకోచ్చారు.
ఈ కేసులో నిందితులు మాజిద్, ఫైసల్, ఇమ్రాన్, నేహా అలియాస్ అంజలి బాధితుడి కార్యాలయంలోకి ప్రవేశించి... తాము ముంబై పోలీస్ అధికారులమనీ చెప్పుకొచ్చారు. నిందితుడు ఫైసల్ తనను ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. మజీద్ తనను తాను ఎస్‌ఐగా, జ్యోతి అలియాస్ అంజలి మహిళా ఎస్‌ఐగా, ఇమ్రాన్ స్వయంగా ముంబై పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చెప్పుకున్నారు. నిందితులు ప్రశాంత్ కుమార్ పాటిల్, జాహిద్ అలియాస్ గురూజీకి బాధితుడు విజయ్ యాదవ్ తెలుసు. వారు ఫిర్యాదుదారు కార్యాలయం లోపలికి వెళ్లలేదు, వారు నిందితులు సంజయ్ మనోచా, నేహాతో పాటు కార్యాలయం వెలుపల నిఘా ఉంచారు.
నిందితులు జాహిద్ అలియాస్ గురూజీ, ప్రశాంత్ ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారులు. నిందితుడు ప్రశాంత్ రాజస్థాన్‌లో జేఈగా పనిచేస్తున్నాడని, అయితే సస్పెన్షన్‌లో ఉన్నాడని చెబుతున్నారు. ఓ కేసులో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ అతన్ని ఎన్‌ఎస్‌పి కాంప్లెక్స్ నుండి అరెస్టు చేసింది. నకిలీ కంపెనీ నుంచి రుణం మంజూరు చేసినందుకు భోపాల్ జైలులో ఉన్నాడు. అక్కడ మరో నిందితుడు మాజిద్‌ను కలిశాడు. మాజిద్ కూడా మోసం చేసిన కేసులో భోపాల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. నిందితుడు ప్రశాంత్ 12 మార్చి 2022న భోపాల్ జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుండి అతను ఈ దోపిడీకి ప్లాన్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలింది.
ఈ కేసులో మరో నిందితుడు జాహిద్ తాయెత్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చేవాడు. ప్రశాంత్ కు సన్నిహితుడు.. జైలు నుండి విడుదలైన తర్వాత అతను జాహిద్, మాజిద్ అనే ఇద్దరు సహచరులతో పాటు స్నేహితులు విదిషా, ఇమ్రాన్, అంజలి అలియాస్ జ్యోతి, నేహాలతో కలిసి కుట్ర పన్నారు. నేహా కంప్యూటర్ స్పెషలిస్ట్. నకిలీ ఐడీ కార్డులు, పత్రాలు తయారు చేయడంలో ఆమె స్పెషలిస్ట్. ఆమె నకిలీ ఐ-కార్డులు, నకిలీ వారెంట్లను సిద్ధం చేసింది
