Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో జల ప్రవేశం చేసిన మొర్ముగోవా యుద్ధనౌక

ఐఎన్ఎస్ మొర్ముగోవా యుద్ధనౌక ఇవాళ  జల ప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో  మొర్ముగోవా యుద్ధనౌకను జల ప్రవేశం చేయించారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

INS Mormugao commissioned into Indian Navy
Author
First Published Dec 18, 2022, 1:34 PM IST

ముంబై: ఐఎన్ఎస్  మొర్ముగోవా  యుద్ధనౌక  భారత నావికాదళంలోకి ఆదివారంనాడు ప్రవేశించింది.  ఐఎన్ఎస్ మొర్ముగోవా  యుద్ధనౌకను  ఇవాళ  జల ప్రవేశం చేసింది.ఇవాళ  ముంబైలో జరిగిన  కార్యక్రమంలో ఈ యుద్ధనౌక  జలప్రవేశం చేసిన కార్యక్రమంలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్  పాల్గొన్నారు.

ఐఎన్ఎస్   మొర్ముగోవా  యుద్ధనౌక  రెండవ స్టెల్త్  గైడెడ్  క్షిపణి విధ్వంసక  నౌక. గత ఏడాది  నవంబర్  21న  ఐఎన్ఎస్  విశాఖపట్టణం జల ప్రవేశం చేసింది. గోవా రాష్ట్రానికి   చెందిన  మొర్ముగోవా  పేరును ఈ నౌకను పెట్టారు..ఈ నౌక  163 మమీటర్ల పొడవు,  17 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. 7,400 టన్నుల బరువును  ఈ నౌక మోసుకెళ్లనుంది.  ఈ నౌక వేగం  30 నాట్స్ గా  అధికారులు చెబుతున్నారు. ఇండియన్ నేవీ అంతర్గత  సంస్థ  అయిన వార్ షిప్ డిజైన్  బ్యూరో చేత  ఈ నౌక డిజైన్ చేశారు.  మజాగాన్  డాక్‌షిప్  బిల్డర్స్ చేత  ఈ నౌకను  నిర్మించారు. ఈ నౌకను  స్వదేశీ ఉక్కు  డీఎంఆర్  249 ఏ ఉపయోగించి తయారు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios