మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ట్రాక్‌పై ప్రజలు ఉండటాన్ని గమనించిన లోకో పైలట్.. రైలును నిలిపేందుకు ప్రయత్నించారని, కానీ అది విఫలమైందని రైల్వే వర్గాలు తెలిపాయి.

Also Read:సైకిల్‌పై కుటుంబంతో సొంతూరికి ప్రయాణం: దారిలోనే కబళించిన మృత్యువు

కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా మార్గంలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు రైల్వే ట్రాకుపై నిద్రిస్తున్న వారిపై గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మరణించిన సంగతి తెలిసిందే.

వీరంతా జల్నాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వలసకూలీలు. లాక్‌డౌన్ వల్ల ఫ్యాక్టరీ మూత పడటంతో వీరంతా మధ్యప్రదేశ్‌లోని భూస్వాల్‌కు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి తమ ఊరికి రైలులో నడిచి వెళ్లాలని భావించారు.

Also Read:దేశంలో 56వేలు దాటిన కరోనా కేసులు, 24గంటల్లో 5వేల కేసులు

దాదాపు 45 కిలోమీటర్ల దూరం నడిచాక వారు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.