స్ట్రెచర్ పై పిల్లాడిని మోస్తూ 1300 కిలోమీటర్ల వలస కూలీల ప్రయాణం

తీవ్రంగా గాయపడ్డ ఒక చిన్న పిల్లాడిని కర్రలతో వారు తాయారు చేసిన స్ట్రెచర్ మీదవేసుకొని ఒకే కుటుంబానికి చెందిన 17 మంది 1300 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకోవడానికి నడుస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Injured Child On Make-Shift Stretcher, Migrant Family's 1300-km Walk Home From Punjab To Madhya Pradesh

లాక్ డౌన్ వల్ల వలసకార్మికుల ఇబ్బందులు ప్రధానమంత్రి ప్రసంగం తరువాత కూడా ఆగడం లేదు. వారు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లాపాపలతోసహా రోడ్లవెంట నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు నిత్యకృత్యమయిపోయాయి. ఏ ఛానల్ పెట్టినా వలసకూలీల కన్నీటి గాధలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. 

తీవ్రంగా గాయపడ్డ ఒక చిన్న పిల్లాడిని కర్రలతో వారు తాయారు చేసిన స్ట్రెచర్ మీదవేసుకొని ఒకే కుటుంబానికి చెందిన 17 మంది 1300 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకోవడానికి నడుస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పంజాబ్ రాష్ట్రం లూథియానా నుండి తమ మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగరౌలి దగ్గర్లోని తమ ఊరిని చేరుకోవడానికి ఈ కుటుంబం నడకను ఆరంభించింది. ఆ 17 మందిలో ఒక చోయిన్న పిల్లాడి మెడలు విరాగి, కళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడు. 

వారంతా కర్రలతో ఒక స్ట్రెచర్ లాంటిదాన్ని తయారు చేసి దానిపై ఈ పిల్లాడిని పడుకోబెట్టి వారంతా వంతుల వారీగా ఆ స్ట్రెచర్ ని మోసుకుంటూ వెళుతున్నారు. ఇలా దాదాపు 800 కిలోమీటర్లు నడిచిన తరువాత, ఇంకో 500 కిలోమీటర్ల దూరం ఉందనగా అధికారులు వారిని గుర్తించి వారికో ట్రక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 

గత 15 రోజులుగా ఈ కుటుంబమంతా రోడ్డుపైన నడుస్తూనే ఉంది. వారికి కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఈ ఎండలో వారిలో చాలామంది కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడానికి బయల్దేరారు. 

 తాజాగా రెండు రోజుల కింద ఇలానే హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని సొంతూరు బాలఘాట్ కు గర్భిణీ భార్య, కూతురితో బయల్దేరి నిన్న చేరుకున్నాడు ఒక వలస కార్మికుడు. అన్ని కష్టనష్టాలకోర్చి 700 కిలోమీటర్లను తన భార్యను, కూతురిని ఒక చిన్న చక్రాలతో సొంతగా తయారు చేసిన తోపుడు బండిపై లాక్కుంటూ చేరుకున్నాడు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios