ట్విట్టర్ వేదికగా.. ఆనంద్ మహీంద్రా శివాంగి సింగ్ ను పొగిడారు.. ఆయన తన ట్వీట్ లో ‘అవును.. మీరు శివంగి లాగా శత్రువుల మీద విరుచుకు పడండి.. మీరు మా రఫెల్ రాణి’ అని పేర్కొన్నారు.ఇక దేశంలో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళ పైలెట్ గా గుర్తింపు పొందింది శివాంగి సింగ్. రిపబ్లిక్ డే పరేడ్లో ఎయిర్ ఫోర్స్ శకటంపై ఆమె సెల్యూట్ చేస్తూ కనిపించింది. 

social mediaలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికరమైన విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ Anand Mahindra. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. దేశంలో Rafale యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళ పైలెట్గా గుర్తింపు పొందిన Shivangi Singh ను అభినందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా.. మహీంద్రా పంచుకున్నారు. ఆ ట్వీట్ లో ‘అవును.. మీరు శివంగి లాగా శత్రువుల మీద విరుచుకు పడండి.. మీరు మా రఫెల్ రాణి’ అని పేర్కొన్నారు.

ఇక దేశంలో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళ పైలెట్ గా గుర్తింపు పొందింది శివాంగి సింగ్. రిపబ్లిక్ డే పరేడ్లో ఎయిర్ ఫోర్స్ శకటంపై ఆమె సెల్యూట్ చేస్తూ కనిపించింది. అలాగే, ఎయిర్ ఫోర్స్ శకటాల ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలెట్ గా కూడా ఈమె ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన శకటంపై నిలుచుని జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని సెల్యూట్ చేస్తూ కనిపించారు ఆమె.

అలా ఈరిపబ్లిక్ డే నాడు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా శివంగి సింగ్ నిలిచింది. వారణాసికి చెందిన శ్రీమతి సింగ్ 2017లో ఐఎఎఫ్ లో చేరారు. ఐఎఎఫ్ రెండవ బ్యాచ్ మహిళా ఫైటర్ పైలెట్లలో నియమించబడ్డారు. రఫేల్ నడపడానికి ముందు ఆమె Mig -21 బైసన్ విమానాలను నడిపింది. పంజాబ్ లోని అంబాలా కేంద్రంగా పనిచేస్తున్న ఐఎఎఫ్ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్’లో ఆమె భాగం. 

కాగా, బుధవారం 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ పరేడ్‌లో భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా రాఫెల్ ఫైటర్ జెట్ పైలట్ శివాంగి సింగ్ పాల్గొన్నారు. ఆమె భారత వైమానిక దళం (IAF) శ‌క‌టంలో భాగ‌స్వామ్యం అయిన రెండవ మహిళా ఫైటర్ జెట్ పైలట్. గ‌తేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావా కాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

‘‘భవిష్యత్తు కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోంది’’ అనే థీమ్ తో నేటి శకటాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూపొందించింది. రాఫెల్ ఫైటర్ జెట్ లోని స్కేల్ డౌన్ మోడల్స్, స్వదేశీంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (LCH), 3D నిఘా రాడార్ Aslesha MK-1 ఈ ఫ్లోట్‌లో భాగంగా ఉన్నాయి. ఇది 1971 యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన MiG-21 విమానంలోని స్కేల్ డౌన్ మోడల్ ఇందులో ఉంది. ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య జరిగిన యుద్దంలో ఈ విమానం పాల్గొంది.

రూ. 59,000 కోట్లతో 36 విమానాలను కొనుగోలు చేసేందుకు భారతదేశం- ప్రాన్స్ కు మధ్య ఒప్పందం జరిగిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్ జెట్‌లు జూలై 29, 2020 ఇండియాకు వచ్చాయి. ఇప్పటి వరకు 32 రాఫెల్ జెట్‌లను ప్రాన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు డెవవరీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మరో నాలుగు రావచ్చని అంచనా ప్రభుత్వం అంచనా వేస్తోంది.