న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్  మీడియా కేసులో  మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీయా అఫ్రూవర్ గా మారేందుకు  సీబీఐ కోర్టు అంగీకరించింది.

ఈ మేరకు ఇంద్రాణీ ముఖర్జీయా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు అంగీకరించింది. ఇంద్రాణీ ముఖర్జీ తాను ఈ కేసులో అఫ్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను  సీబీఐ జడ్జి అరుణ్ భరద్వాజ్  గురువారం నాడు అనుమతిచ్చారు. 

ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. తమ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని  కోర్టు  ముఖర్జీయాను ఆదేశించింది. ఈ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.