ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నఇంద్రాణి ముఖర్జియా,  ఆమె భర్త పీటర్‌ ముఖర్జియా విడిపోయేందుకు సిద్ధమయ్యారు. విడాకుల కోసం దంపతులు ముంబైలోని బంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. 

విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పరస్పరం అంగీకారంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంద్రాణి దంపతులు వెల్లడించారు. ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలను కూడా పిటిషన్‌లో పొందుపరిచారు.

ఇంతవరకు దంపతులిద్దరూ ఉమ్మడిగా ఆర్థిక లావాదేవీలు జరిపిన బ్యాంకు అకౌంట్లను సైతం మార్పు చేసుకునేందుకు అంగీకరించినట్లు పిటీషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఖాతాను వ్యక్తిగత అకౌంట్లుగా మార్చుకుంటామని తెలిపారు. 

వీటితోపాటు ఇద్దరి పేరిట సిండికేట్‌ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలు, విలువైన నగలు, ఖరీదైన వాచ్‌లు, బ్యాంకు లాకర్లను సమంగా పంచుకునేందుకు తామిద్దరికీ సమ్మతమేనని పిటిషన్‌లో తెలిపారు. 

అలాగే దేశంలోని అపార్ట్మెంట్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ లోని బ్యాంకు అకౌంట్లలోని నగదును సమానంగా పంచుకుంటామని తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి లెక్కలు చూపించలేదు. ముంబై వ్యాలీ, గోవా, లండన్, స్పెయిన్ లలో ఉన్న భవనాలను కూడా ఒప్పందం ప్రకారం పంచుకుంటామని పిటీషన్ లో తెలిపారు. 

  దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ మోటల్ ఇంద్రాణి, టైకూన్ పీటర్ ముఖర్జియా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2002లో వివాహం చేసుకున్నారు.  లో పరిచ16 ఏళ్ల క్రితం ఇంద్రాణి, మీడియా టైకూన్‌ పీటర్‌ ముఖర్జియా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే.

 16 ఏళ్లపాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితంలో అనేక ఆటుపోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 2012లో ఇంద్రాణి తన కుమార్తె షీనా బోరాను హత్య చేయించింది. అయితే ఈ హత్య బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం మూడేళ్ల తర్వాత 2015లో షీనా బోరా హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. షీనా బోరా మృతదేహాన్ని ముంబై సమీపంలోని అడవుల్లో పోలీసులు గుర్తించారు.  

 షీనాబోరా హత్యకు సంబంధించి ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారడంతో గుట్టు రట్టైంది. దీంతో 2015లో ఇంద్రాణి ప్రధాన ముద్దాయిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్ చేవారు. ఆమె బైకుల్లా జైల్లో శిక్ష అనుభవించారు. షీనా బోరాహత్య కేసులో ఆమె సవతి తండ్రి పీటర్‌ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.  పీటర్ ముఖర్జీ ఆర్థర్ రోడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.