Indore Crime News: జన్మనిచ్చిన బిడ్డను పోషించలేక ఓ మైనర్ తల్లి తన 2 నెలల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొంతు నులిమి అతి దారుణంగా హతమార్చింది. అమానవీయకర సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
Indore Crime News: మహిళల, చిన్నారుల రక్షణ కోసం.. ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలను తీసుకవచ్చినా.. వారిపై జరుగుతోన్న అఘాత్యాలను అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి. నిత్యం ఏదోక చోట అవమానాల్లో కూరుకుపోతూ, అన్యాయానికి గురవుతున్నారు. హత్యలకూ అత్యాచారాలకూ బలవుతునే ఉన్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్ లో అమానవీయకర సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.
జన్మనిచ్చిన బిడ్డను పోషించలేక ఓ మైనర్ తల్లి తన 2 నెలల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొంతు నులిమి అతి దారుణంగా హతమార్చింది. కాసేపటికి స్థానికులు జరిగిన దారుణాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇండోర్‌లోని ఖజ్రానా ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఆ యువకుడిని, బాధితురాలి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకొవాలని విజ్ఞప్తి చేశారు. తమ బిడ్డకు అన్యాయం చేయకూడదని ప్రాదేయపడ్డారు. దీంతో ఆ యువకుడు కనపడకుండా పారిపోయాడు. ఈ క్రమంలో నెలలు నిండటంతో ఆ మైనర్ బాలిక ప్రసవించింది. ఓ బిడ్డకు తల్లి అయ్యింది.
కానీ మైనర్ తల్లి తన 2 నెలల బిడ్డను సరిగ్గా పోషించలేకపోయింది. దీంతో ఆ బాలిక తన రెండు నెలల పసికందుపట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొంతు నులిమి అతి దారుణంగా హతమార్చింది. ఈ సమయంలో అప స్మారక స్థితిలోఉన్న చిన్నారిని చూసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
అదే సమయంలో.. శిశువు అసాధారణ స్థితిలో మరణించిందని గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిగా ఉన్న మైనర్ తల్లిని పోలీసులు విచారించగా.. తన బిడ్డను తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనలో మరెవ్వరి ప్రమేయం లేదని, సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల కస్టడీలో ఉందని, వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నబాలికపై రెండేళ్ల క్రితం ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని అదనపు డీసీపీ రాజేష్ వ్యాస్ తెలిపారు. ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చింది. కానీ, తన బిడ్డ పెంపకం గురించి ఆందోళన చెంది, పెళ్లి చేసుకోవాలనుకుని, సమాజం చిన్న చూపు చూస్తుందని తన బిడ్డను ఆమె చేతిలో హతమార్చిందని నిర్ధారణ అయ్యింది. చనిపోయిన చిన్నారికి పోస్ట్‌మార్టం జరిగింది. హత్యా చర్యగా తేలింది. కేసు నమోదు చేసి బాలికను అరెస్టు చేశామని వ్యాస్ తెలిపారు.
