ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కుప్పకూలింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. 

ఇండోర్‌లోని పటాల్‌పానీ ప్రాంతంలోని ఫామ్‌హౌజ్ లో నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలింది.దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్ కుటుంబసభ్యులు మృతి చెందినట్టుగా స్థానికులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో తాత్కాలిక లిప్ట్ ను నిర్మించారు. లిఫ్ట్ ద్వారా నిర్మాణంలో ఉన్న భవనంపైకి పునీత్ అగర్వాల్ కుటుంబసభ్యులు చేరుకొన్నారు. 

ఆ సమయంలో తాత్కాలిక లిఫ్ట్ కూలిపోయింది. దీంతో భవనం పై భాగంలో ఉన్న వారంతా ఒకేసారి కిందపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో నిధి అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. నిధి అగర్వాల్ కు శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టుగా వైద్యులు చెప్పారు. ఆమె పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది. వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.