మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో  స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ వ్యాధితో 41 మంది మరణించడంతో ఇండోర్ నగరంలో కలకలం ఏర్పడింది. 

644 మందిని పరీక్షించగా వీరిలో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది. ప్రస్థుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముఖ్య వైద్యాధికారి ప్రవీణ్ జాదియా చెప్పారు. స్వైన్ ఫ్లూ కలకలంతో తాము ఫీవర్ క్లినిక్ తెరచామని ప్రవీణ్ పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడంతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.