Asianet News TeluguAsianet News Telugu

విమానం పక్కనే , రన్‌వే పై భోజనం చేసిన ప్రయాణికులు.. ఇండిగోకు కేంద్రం నోటీసులు , సాయంత్రం వరకు డెడ్‌లైన్

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. తరచుగా ప్రభుత్వం నుంచి మొట్టికాయలు కూడా వేయించుకుంటోంది. తాజాగా మరోసారి ఆ సంస్థ చిక్కుల్లో పడింది. ముంబై విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు విమానం పక్కన, నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. 

IndiGo, Mumbai airport get Centre's notice over passengers eating on tarmac ksp
Author
First Published Jan 16, 2024, 3:52 PM IST

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. తరచుగా ప్రభుత్వం నుంచి మొట్టికాయలు కూడా వేయించుకుంటోంది. తాజాగా మరోసారి ఆ సంస్థ చిక్కుల్లో పడింది. ముంబై విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు విమానం పక్కన, నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ , ముంబై విమానాశ్రయానికి నోటీసులు ఇచ్చింది. 

పరిస్ధితులను అంచనా వేయడంలో, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఇండిగో సంస్థతో పాటు ముంబై ఎయిర్‌పోర్టు తగినవిధంగా వ్యవహరించలేదని నోటీసులో పేర్కొంది. యాత్రికుల సౌకర్యం, భద్రత, నిర్వహణ అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండా విమాన కార్యకలాపాలు కొనసాగించారని ఫైర్ అయ్యింది. మంగళవారం సాయంత్రం లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

అసలేం జరిగిందంటే :

ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో వేచి వుండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై విమానాశ్రయంలో లాండ్ అయ్యింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో కొందరు ప్రయాణికులు దిగిన వెంటనే, నేలపై కూర్చొని ఆహారం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది. 

మరో ఘటనలో విమానం ఆలస్యమైన అనంతరం రద్దు కావడం వల్ల ఓ ప్రయాణికుడు పైలట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్న సమయంలో ఢిల్లీ-గోవా ఇండిగో విమానంలో పైలట్ పై అతడు దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పదించారు. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత ఉందని ఇండిగో పైలట్ ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ ఆలస్యాన్ని ప్రకటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు విమానంలోని పైలట్ వైపు దూసుకొచ్చి కొట్టాడు. దీనిని అక్కడున్న ప్రయాణికులు వీడియో తీశారు. అయితే పైలట్ పక్కన నిల్చున్న ఫ్లైట్ అటెండెంట్ కన్నీటి పర్యంతమై పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

విమానం కొన్ని గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికుడు ఆందోళనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం.. ఇండిగో విమానం 10 గంటలకు పైగా ఆలస్యం తర్వాత సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది. కాగా.. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా లేదా రద్దవడంతో పలు విమానాశ్రయాలు, ముఖ్యంగా ఢిల్లీలో ఆదివారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 100 విమానాలు ఆలస్యంగా, ఐదు విమానాలను దారి మళ్లించారు. ఆందోళనకు దిగిన ప్రయాణికులు గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios