ఓ విమాన ప్రయాణికుడు తన టికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ టికెట్‌లో ఇతర చార్జీలతోపాటు క్యూట్ ఫీజు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది. వయసు పెరిగినా కొద్దీ తాను క్యూట్ అవుతున్నానని, ఈ విషయం తనకు తెలుసు అని ఆ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. కానీ, తన క్యూట్‌నెస్‌కూ చార్జీ వేస్తారని తనకుతెలియదని తెలిపారు.
న్యూఢిల్లీ: ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన విమాన టికెట్ వైరల్ అవుతున్నది. శాంతాను అనే ట్విట్టర్ యూజర్ తన విమాన టికెట్ ఫొటో కాపీని పోస్టు చేశారు. దానికి ఒక వ్యాఖ్యను కూడా జోడించారు. వయసు పెరిగిన కొద్దీ తాను క్యూట్‌గా తయారవుతున్నానని తనకు తెలిసిందేనని వివరించారు. కానీ, ఇండిగో సంస్థ తన క్యూట్‌నెస్‌కు కూడా చార్జీ వసూలు చేస్తుందని ఊహించలేదని ట్వీట్ చేశారు. తనకు క్యూట్ ఫీజు కింద రూ. 100 వసూలు చేసినట్టు ఆయన తన ఫ్లైట్ టికెట్ పిక్ ట్వీట్ చేశారు.
ఆ టికెట్‌లో క్యూట్ ఫీజుతోపాటు ఎయిర్‌ఫేర్ చార్జీలు, సీటు ఫీజు, కన్వీనియెన్స్ ఫీజు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఫీజు, యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులూ ఆ టికెట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ చార్జీల వల్లే తాను ఇండిగోలో ఫ్లైట్ టికెట్ బుక్ చేయనని మరో యూజర్ కామెంట్ చేశారు. తనకైతే ఆ క్యూట్ ఫీజు రూ. 20 వేలు పడుతుందని, నిజానికి ఫ్లైట్ టికెట్ కంటే కూడా ఈ ఫీజునే ఎక్కువ ఉంటుందని ట్వీట్ చేశారు.
కాగా, ఇంకొందరు క్యూట్ ఫీజు ఏమిటో వివరించే పనిలో పడ్డారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను క్యూట్ ఫీజు వసూలు చేస్తుంది. క్యూట్ ఫీజులో క్యూట్ ఫుల్ ఫాామ్ కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్‌మెంట్ ఫీజు అని వివరించారు. మెటల్ డిటెక్టింగ్ మెషీన్స్, ఎస్కెలేటర్, ఎయిర్‌పోర్టులోని ఎక్విప్‌మెంట్‌ల చార్జీని ఈ క్యూట్ ఫీజులో భాగంగా వసూలు చేస్తారు. అంతేకాదు, కొన్ని విమాన సంస్థలు ఈ క్యూట్ ఫీజును ప్యాసింజర్ హ్యాండ్లింగ్ ఫీజుగా వసూలు చేస్తారని తెలిపారు.
అయితే, ఆ టికెట్‌లో క్యూట్ ఫీజులో అక్షరాలు షార్ట్ ఫామ్ అని తెలియజేయడానికి అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో పేర్కొనలేదు. ఈ కారణంగానే అసలు చర్చ మొదలైంది.
మరొకరు యూజర్ హే... ఎయిర్‌లైన్.. ఏమిటీ ఈ చార్జీలు.. నాతో స్మార్ట్ గా యాక్ట్ చేయాలని చూస్తున్నవా? స్మార్ట్ కాదు.. క్యూట్ అని వివరించారు.
