Asianet News TeluguAsianet News Telugu

డీసీజీఐ అనుమతి కోరిన జైడస్: త్వరలో అందుబాటులోకి జైకోవ్ డీ

:జైడస్  క్యాడిల్లా కరోనా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐ అనుమతి కోరింది. ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్మా డీఎన్ఏ వ్యాక్సిన్ గా జైడస్ క్యాడిల్లా పేరొందింది.

Indias Zydus Cadila Seeks Nod For Its 3-Dose, "Needle-Free" Vaccine lns
Author
New Delhi, First Published Jul 1, 2021, 10:46 AM IST

న్యూఢిల్లీ:జైడస్  క్యాడిల్లా కరోనా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐ అనుమతి కోరింది. ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్మా డీఎన్ఏ వ్యాక్సిన్ గా జైడస్ క్యాడిల్లా పేరొందింది.కరోనాకు అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు ధరఖాస్తు చేసింది.  ఇండియాలోని కరోనా వ్యాక్సిన్  కోసం క్లినికల్ ట్రయల్ నిర్వహించింది. ఇండియాలోని 12 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయస్సున్న వారిలో వ్యాక్సిన్ పరీక్షించారు.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర నివేదికలో  66 శాతం  సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు నిర్వహించిన రెండు  క్లినికల్ ట్రయల్స్ లో బలమైన రోగ నిరోధక శక్తి ఉన్నట్టుగా తేలిందని ఆ కంపెనీ ప్రకటించింది. మూడు క్లినికల్ ట్రయల్స్  ఫలితాలను స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు పర్యవేక్షిస్తోంది.

ఇప్పటికే నాలుగు కరోనా వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదిస్తే ఐదో వ్యాక్సిన్ గా  తేలనుంది.కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్,  మోడెర్నా వ్యాక్సిన్లకు కేంద్రం ఇప్పటికే అనుమతించింది.  వైరస్ లోని ఉత్పరివర్తనాలను  ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తోందని కంపెనీ తెలిపింది.ఈ వ్యాక్సిన్ కు జైకోవ్-డిగా పేరు పెట్టారు. ఈ ట్రయల్స్ లో కూడ సానుకూల ఫలితాలు వచ్చాయని ఆ కంపెనీ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios