బ్రిటన్‌ను వణికిస్తున్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్.. భారత్‌లో చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో వెలుగు చూసిన మొత్తం కేసుల సంఖ్య 109కు చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం వెల్లడించింది.

సాధారణ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపించే యూకే స్ట్రెయిన్ ను బ్రిటన్‌లో గుర్తించినప్పటి నుంచి భారత్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరు 22 నుంచి యూకే నుంచి విమానాలను నిషేధించారు.
తర్వాత యూకే నుంచి విమానాలను అనుమతించినప్పటికీ యూకే నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని రావాలనే నిబంధనను పెట్టారు. భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు టెస్టులు చేసి, ఫలితాలు నెగెటివ్‌గా వచ్చిన తర్వాతే బయటకు పంపుతున్నారు.
కాగా, కేంద్రం గురువారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093కు, మరణాల సంఖ్య 1,51,727కు పెరిగింది. గడిచిన ఆరు నెలకుగానూ, నిన్న నమోదైన మరణాలు 200 లోపు ఉండటం గమనార్హం