నెల్లూరు: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం నాడు తెల్లవారుజామున జీశాట్ -30 ఉపగ్రహన్ని నింగిలోకి పంపింది.

శుక్రవారం నాడు తెల్లవారుజామున  2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఏరియన్-5 వాహక నౌక ద్వారా జీ శాట్ ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు.

Also read:కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా

ఈ ఉపగ్రహం బరువు 3357కిలోలు. ఇది కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతోంది. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సంబంధించిన సేవలను మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.