Asianet News TeluguAsianet News Telugu

Nirmala Sitharaman.. మాటలు కాదు, చేతలు కావాలి: నిర్మలా సీతారామన్

దుబాయ్ లో జరిగిన  ఇండియా గ్లోబల్ ఫోరమ్ మిడిల్ ఈస్ట్ అండ్  ఆఫ్రికా 2023 ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

Indias Finance Minister Nirmala Sitharaman demands action, not words, at COP28 lns
Author
First Published Nov 28, 2023, 12:52 PM IST

న్యూఢిల్లీ: రాబోయే ప్రపంచ వాతావరణ సదస్సులో  నిధులు,సాంకేతిక పరిజ్ఞానాన్నిబదిలీ చేయడంపై  కచ్చితమైన చర్యల కోసం  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.

సోమవారంనాడు దుబాయ్ లో  జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్ మిడిల్ ఈస్ట్ అండ్  ఆఫ్రికా 2023(ఐజీఎఫ్ ఎంఈఅండ్ఏ) ప్రారంభ కార్యక్రమంలో  మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.వర్చువల్ గా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యూఎన్ వాతావరణ చర్చలు ఈ ఏడాది డిసెంబర్  12 వరకు  యూఏఈలో జరుగుతాయి.  వాతావరణ ప్రభావాలు, శిలాజ ఇంధనాల వినియోగం,  మిథేన్ ఉద్గారాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు  ఆర్ధిక సహాయంపై  చర్చించనున్నారు. 

అభివృద్ది చెందుతున్న మార్కెట్, ఆర్ధిక వ్యవస్థలకు నిధులు సమకూర్చడం చాలా పెద్ద సవాల్ గా ఉంది,ఈ విషయమై  చర్చలు జరగాలని తాను భావిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సీఓపీ 28 సాంకేతిక బదిలీకి, వాస్తవ నిధుల కోసం దిశను చూపాల్సిన అవసరం ఉందన్నారు.

మధ్య ప్రాచ్యంలోని ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు  భారతదేశం, మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ పై  ప్రభావం చూపబోవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇది దీర్ఘకాల పరిశీలనల కోసం  ఒక దృష్టి, దీర్ఘకాలిక ప్రాజెక్టు కానుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఇది కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన ఒకటి లేదా మరొక ప్రధాన సంఘటనపై ఆధారపడదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.  భారతదేశం ప్రతి మధ్య ప్రాచ్య దేశాలు(మిడిల్ ఈస్ట్ ) దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  మాటలకు బదులుగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాప్  28కి దిశా నిర్ధేశం చేయాలని మంత్రి కోరారు.  

భారత దేశంతో ప్రపంచ వాణిజ్యం, ప్రపంచ భాగస్వామ్యాలు కలిగిన వారికి ప్రయోజనం చేకూరేలా చూసుకోవాలని ఆమె కోరారు.ఐజీఎఫ్, ఎంఈఏ , మిడిల్ ఈస్ట్ కు చెందిన వ్యాపార నాయకులు, విధాన రూపకర్తల, నేతలను సమావేశపర్చి ఈ ప్రాంతాల మధ్య మరింత సహకారం, వృద్ది అవకాశాల గురించి  చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలు, టెక్నాలజీ , సుస్థిరతతో సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.

భారతదేశం వంటి దేశాలు  తమ స్వంత ప్లాట్ ఫారాలను సృష్టించే సాంప్రదాయేతర మార్గంలోకి ఎందుకు వెళ్లాయని ఆమె ప్రశ్నించారు. అనేక దేశాలు కూడ  అదే మార్గంలో వెళ్లాలని తాను భావిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. ఏఐ సమాజాన్ని ప్రభావితం చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.  ఏఐ  21 శతాబ్దాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లేందుకు  వీలుకల్పించే టెక్నాలజీ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్ రంగం.ఏఐ ప్రభావం భౌగోళికంగా భిన్నంగా ఉంటుందని ఒలామా చెప్పారు.

ఏఐ ప్రభావం యూఏఈ కంటే  భారత్ లో భిన్నమైన సవాళ్లను చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, గుజరాత్ పరిశ్రమల శాఖ మంత్రి హర్ష్ సంఘవి తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ఇండియా గ్లోబల్ ఫోరమ్ మిడిల్ ఈస్ట్ అండ్  ఆఫ్రికా 2023 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఏఐ అనేది 21వ శతాబ్దాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తుందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios