న్యూఢిల్లీ: హోంఐసోలేషన్  కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలను కోరారు. సోమవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో కేసులు నమోదౌతున్నాయన్నారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా కేసుల పెరుగుదలను తగ్గించవచ్చన్నారు.  అంతేకాదు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 82 శాతానికి తగ్గిందన్నారు. కరోనాతో మరణించే రోగుల సంఖ్య 89శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు.

 దేశంలో కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను వ్యాక్సినేషన్  ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. వ్యాక్సిన్ తీసుకోవాల్సినవారంతా కోవిన్ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని  కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.  చాలా రాష్ట్రాల్లో తమ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు ముందుకు వచ్చాయి.