Asianet News TeluguAsianet News Telugu

కేరళ: భారత తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో చికిత్స

భారతదేశంలో తొలి కరోనా పేషెంట్‌గా రికార్డుల్లోకెక్కిన వైద్య విద్యార్ధిని మరోసారి కోవిడ్ బారినపడ్డారు. కేరళకు చెందిన ఆమె.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
 

indias 1st corona patient tests positive for coronavirus again ksp
Author
Kerala, First Published Jul 13, 2021, 4:04 PM IST

మన దేశంలో తొలి కరోనా పేషెంట్‌ అయిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని కేరళలోని త్రిసూర్ వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా పేషెంట్ గా గుర్తింపు పొందారు. 2020 జనవరి 30న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. 

ఈ సందర్భంగా త్రిసూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా మాట్లాడుతూ, సదరు విద్యార్థిని మరోసారి కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆమెకు వచ్చింది అసింప్టొమేటిక్ అని తెలిపారు. చదువు కోసం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం సదరు విద్యార్ధిని హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని తెలిపారు.

Also Read:కోవిడ్ 19 : దేశంలో మరోసారి భారీగా మరణాలు.. 31వేలకు దిగువకు కేసులు..

బాధిత విద్యార్థినికి తొలిసారి కరోనా నిర్ధారణ అయినప్పుడు త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మూడు వారాల పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ అని తేలిన తర్వాత ఆ విద్యార్ధినిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2020 ఫిబ్రవరి 20న ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios