ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభించిన సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారతదేశానికి  తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ గంగా’’ చేపట్టిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభించిన సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ గంగా’’ చేపట్టిన సంగతి తెలిసిందే. యుద్దంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుంచి దాదాపు 22,500 మంది భారతీయులను ఖాళీ చేయించింది. గత సంవత్సరం ప్రపంచంలో ఎక్కడా నిర్వహించని అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్లలో ఇది ఒకటిగా నిలిచింది. అయితే అద్భుతమైన రాజనీతిజ్ఞత, క్షేత్రస్థాయిలో సమన్వయం, బయట స్థిరపడిన భారతీయ స్నేహితుల నుంచి కొంచెం సహాయం లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాకు సంబంధించి హిస్టరీ టీవీ 18.. ‘‘ది ఎవాక్యుయేషన్: ఆపరేషన్ గంగా’’ పేరుతో శనివారం(జూన్ 17) ప్రదర్శించిన డాక్యుమెంటరీలో.. ఉక్రెయిన్, దాని పొరుగు దేశాలైన పోలాండ్, హంగేరి, స్లోవేకియా మరియు రొమేనియాలో భారతీయ ప్రవాసులు ఎలా స్థిరపడ్డారు.. వారు విద్యార్థులకు ఆహారం, బట్టలు, ఇల్లు ఇవ్వడం ద్వారా సాయంగా నిలిచారనేది చూపించారు. అలా చేయడం ద్వారా ‘‘ప్రపంచం ఒకే కుటుంబం'’’ అనే అర్ధం వచ్చే ‘‘వసుధైవ కుటుంబం’’ పురాతన విలువను చాటిచెప్పారు.

రష్యా తన పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై దాడి చేసిన వెంటనే చాలా సవాలుగా ఉన్న సమయాల్లో.. స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు.. అగ్రశ్రేణి మంత్రులు, భారత రాయబార కార్యాలయాలు, ప్రవాసులు వారివంతుగా ప్రయత్నాలు చేపట్టాయి.

‘‘ప్రపంచంలో భారతీయుడు ఎక్కడ ఉన్నా.. వారి పాస్‌పోర్ట్‌ల రంగు మారినప్పటికీ.. వారికి వారి దేశంతో రక్త సంబంధం ఉంది... మనమందరం భారతదేశానికి రక్తంతో అనుసంధానించబడ్డాము’’ అని డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ అన్నారు.

ఇదిలా ఉంటే, భారతీయ విద్యార్థులను విమానాల ద్వారా ఖాళీ చేయడానికి ముందు వారికి ఆశ్రయం కల్పించడానికి తాను ఎలా ఏర్పాట్లు చేశారనేది ఇండో పోలిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ అమిత్ లాత్ తెలియజేశారు. ‘‘నేను ఆ ప్రాంతంలోని హోటళ్లు, మోటళ్లకు 160-ప్లస్ కాల్స్ చేసాను. నేను ఒక నిర్దిష్ట హోటల్ వ్యాపారిని సంప్రదించినప్పుడు.. నాకు 24 గంటల్లో 250 పరుపులు అవసరమని చెప్పాను. తొలుత అతనికి అర్థం కాలేదు. కానీ, అతను పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మేము కోరుకున్న విధంగా విషయాలను ఏర్పాటు చేసేంత దయతో ఉన్నాడు’’ అని తెలిపారు. 

ఇండో-పోలిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ రిలేషన్స్ డైరెక్టర్ చంద్రమోహన్ నల్లూర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక కంపెనీకి ఫోన్ చేసి వారు దాదాపు 3,000 సిమ్ కార్డులను ఏర్పాటు చేయగలరా అని అడిగాను. వారు 20,000 మందిని ఉచిత ఇంటర్నెట్‌తో పంపారు. కేవలం భారతీయులకే కాదు.. దేశం దాటే ప్రతి ఒక్కరికీ’’ అని పేర్కొన్నారు. 

రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రొమేనియాకు పంపబడిన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆ అనుభవాలను పంచుకున్నారు. ‘‘మన పౌరులందరూ, ఆ దేశాల్లోని ఇతరులు, కూర్చుని భోజనం వండడం, రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేయడం, విద్యార్థుల వైద్య అవసరాలను తీర్చడం - ఇది భారతదేశం మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంది. మా ఎన్‌ఆర్‌ఐలు నిజంగా మా విద్యార్థులకు సహాయం చేశారు’’ అని చెప్పారు. ‘‘విప్రో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా.. అనేక కంపెనీలు తెరపైకి వచ్చాయి’’ అని సింధియా చెప్పారు. 

‘‘ప్రధానమంత్రి సంప్రదించినప్పుడు ఆయన గొంతులో తీవ్ర ఆందోళన ఉంది. వేలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయినందున ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న ఈ దేశాల సరిహద్దు పట్టణాల్లో వీలైనంత త్వరగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన మమ్మల్ని అభ్యర్థించారు. మేము వెంటనే సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మా బలగాలను సమీకరించాము’’ అని బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ అంతర్జాతీయ సమన్వయకర్త, ప్రతినిధి బ్రహ్మవిహారిదాస్ స్వామి అన్నారు. 

ఆపరేషన్ గంగా సమయంలో హంగేరీకి వెళ్లిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ‘‘సామాజిక సహాయ ప్రదాతలకు పూర్తి మార్కులు. ప్రతి ఒకరి హృదయం అటువంటి కృతజ్ఞత, వినయంతో నిండి ఉంటుంది. వారు ఏ సంఖ్యలో వచ్చినా ప్రజలకు ఆహారం ఇస్తున్నారు. వారిలో ప్రతి ఒక్కరు.. వియన్నా నుంచి వచ్చిన ఒక రెస్టారెంట్ యజమాని(ఒక సిక్కు వ్యక్తి) తన కుటుంబంతో వచ్చి రోజుకు 600 భోజనం వడ్డించారు’’ అని తెలిపారు. 

పోలాండ్‌కు ప్రత్యేక రాయబారిగా పంపబడిన కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్).. వార్సాలోని గురుద్వారా , దేవాలయం నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ , స్వామినారాయణ అనుచరుల వరకు అన్ని రకాల సంస్థలకు చెందిన వ్యక్తులు సాయంగా ఉన్నారని చెప్పారు. ‘‘మేము అక్కడ ఆర్సెలర్ మిట్టల్‌ను ఏర్పాటు చేసాము’’ అని ఆయన చెప్పారు. అలాగే పలువురు విద్యార్థులు కూడా వారి అనుభవాలను పంచుకున్నారు. 


YouTube video player

ఇక, 2022 ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఆపరేషన్ గంగా అనేక కోణాల నుంచి విజయవంతమైంది. అలాగే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా బట్వాడా చేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. అయితే 21 ఏళ్ల వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మాత్రం మార్చి 1న ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్‌లో చనిపోయాడు. కైవ్‌లో క్రాస్‌ఫైర్‌లో చిక్కుకున్న వారిలో విద్యార్థి హర్జోత్ సింగ్ కూడా ఉన్నాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే చివరి విమానంలో ఇంటికి తరలించబడ్డాడు. ఎ

విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని.. వారు భారత జెండాను చూపినప్పుడల్లా సురక్షితంగా ప్రయాణించి సరిహద్దులకు చేరుకోవడానికి అనుమతించారని మోదీ చెప్పారు. ‘‘హర్ ఘర్ తిరంగా ఉక్రెయిన్‌లో జరిగింది. యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో ఎక్కడ జెండా కనిపించినా.. అది ఎగురుతుంది.. సురక్షితమైన మార్గంగా నిర్ధారించబడింది’’ అని సింధియా చెప్పారు. 

‘‘చర్మం యొక్క రంగు కంటే.. జెండా రంగు చాలా శక్తివంతమైనది. ఈ మొత్తం అనుభవం భారతీయ విద్యార్థులకు త్రివర్ణ పతాక శక్తిని నేర్పింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఏ ఇతర దేశం తమ పౌరుల కోసం ఇలా చేయలేదని పేర్కొన్నారు.